చీరకట్టుతో చూపు తిప్పుకోనివ్వకుండా చేయాలా..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
ఇవి చీర కట్టుకోవడానికి తేలికగా ఉంటాయి. అదేవిధంగా.. అందంగానూ కనిపిస్తారు. ఈ వర్షాకాలంలో కాటన్, పట్టు చీరలను ఎంచుకోకపోవడమే మంచిది.
ఆడపిల్లలు.. ఎలాంటి డ్రెస్ వేసినా రాని అందం... చీరకడితే చాలు వచ్చేస్తుంది. అలా అని ఈ కాలం అమ్మాయిలు.. సాధారణంగా ఏ చీరపడితే ఆ చీరకట్టాలని అనుకోవడం లేదు. ఏ చీర కట్టినా.. స్పెషల్ గా కనిపించాలని.. ట్రెండ్ సెట్టర్ లా ఉండాలని.. తమ వైపు నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా ఉండేలా ఉండాలని కోరుకుంటున్నారు.
మరి అలా కనిపించాలంటే.. చీరకట్టే విషయంలో కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. ముఖ్యంగా వర్షాకాలంలో ఎలాంటి చీరకడితే.. ఎలా కట్టుకుంటే.. అందంగా మెరిసిపోవచ్చో నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మీరు కూడా చూసేయండి.
ప్రస్తుతం పాస్టెల్ రంగులు ట్రెండ్ అవుతున్నాయి. అయితే.. అందులో లైట్ షేడ్స్ కి మాత్రం దూరంగా ఉండాలి. ఈ సీజన్ అవి పెద్దగా నప్పవు. కాబట్టి.. ఆరెంజ్, పసుపు, రస్ట్, పర్పుల్, మెరూన్, ఆకుపచ్చ, బ్లూమ్ పింక్, డార్క్ బ్లూ షేడ్స్ ఎంచుకుంటే.. అందంగా కనపడొచ్చు.
ఆన్ లైన్ లో కానీ.. షాప్ లో కానీ చీర కొనాలని అనుకున్నప్పుడు.. దాని టెక్షర్ విషయంలో ఫోకస్ పెట్టాలి. వర్షాకాలంలో పాలీల జార్జెట్, షిఫాన్ వంటి తేలికపాటి చీరలను ఎంచుకోవాలి. ఇవి చీర కట్టుకోవడానికి తేలికగా ఉంటాయి. అదేవిధంగా.. అందంగానూ కనిపిస్తారు. ఈ వర్షాకాలంలో కాటన్, పట్టు చీరలను ఎంచుకోకపోవడమే మంచిది.
ఇక ఎలాంటి చీర అయినా.. దానిని కట్టే విధానాన్ని పట్టి స్టైలిష్ గా కనిపిస్తారు. ఈ మధ్య సెలబ్రెటీలు చీరలను జెగ్గిన్స్, జీన్స్, అండర్ స్కర్ట్స్ మీద ధరిస్తున్నారు. ఈ స్టైల్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. కాబట్టి.. అలాంటి స్టైల్ ని మీరు కూడా అనుకరించవచ్చు.
వర్షాకాలంలో చీరకట్టుతో మోడ్రన్ గా మెరిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి.. చీరలు ఎంచుకునేటప్పుడు.. చిన్న సైజ్ డిజైన్ లు ఎంచుకోవాలి. పూల ప్రింట్లు ఉన్నవి ఎంచుకోవాలి.
ఇక చీరను వర్షాకాలంలో కాస్త పైకి కట్టుకోవడం బెటర్. దాని వల్ల చీర పాడవ్వకుండా ఉంటుంది. ఇక.. చీర కుచ్చీళ్లు.. కొంగు దగ్గర మడతలు.. నీట్ గా పెట్టుకోవాలి. ఎటూ కదలకుండా.. పిన్ తో సెట్ చేసుకోవాలి. ఇలా చేస్తే.. ఎలాంటి చీర కట్టినా.. స్టైలిష్ గా అందంగా మెరిసిపోయే అవకాశం ఉంటుంది.