MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Woman
  • తెల్ల జుట్టుకు బెస్ట్ సొల్యూషన్.. ఈ ఆకు వాడితే చాలు, హెన్నాతో పని లేదు..!

తెల్ల జుట్టుకు బెస్ట్ సొల్యూషన్.. ఈ ఆకు వాడితే చాలు, హెన్నాతో పని లేదు..!

ఒక ఆకులను వాడటం వల్ల… జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు… తెల్ల జుట్టును కూడా తగ్గించుకోవచ్చు. మరి.. అదేంటో తెలుసుకుందాం… 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 07 2025, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అందమైన జుట్టు కోరుకోనివారు ఎవరూ ఉండరు. జుట్టు ఒత్తుగా.. నల్లగా నిగనిగలాడుతుంటే.. దానికి మించిన అందం స్పెషల్ గా అవసరం లేదు. ఇలాంటి జుట్టు ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.  దాని కోసం మార్కెట్లో దొరికే చాలా రకాల నూనెలు, షాంపూలు వాడుతూ ఉంటాం. ఇక.. తెల్ల జుట్టును కనిపించకుండా ఉండేందుకు.. కలర్ వేయడం, హెన్నా పెట్టడం లాంటివి చేస్తారు. కానీ.. ఒక ఆకులను వాడటం వల్ల… జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు… తెల్ల జుట్టును కూడా తగ్గించుకోవచ్చు. మరి.. అదేంటో తెలుసుకుందాం…

మనం సాధారణంగా తెల్ల జుట్టును కవర్ చేయడానికి ఎక్కువగా హెన్నా వాడుతూ ఉంటారు. కానీ గోరుంటాకు ఆకులకు బదులు.. మునగాకు వాడితే చాలు. ఈ ఆకులను హెన్నాలాగా పేస్టులా తలకు పెట్టవచ్చు.. దీని నుంచి వచ్చే నూనెను జుట్టుకు అప్లై చేసినా.. ఒత్తుగా పెంచుకోవచ్చు. మరి.. దేని కోసం ఈ ఆకులను ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మునగాకు జుట్టు అందానికి ఎలా ఉపయోగపడుతుంది..?

మునగాకు పొడిలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ముునగాకులో విటమిన్ B6 కూడా ఉంది, ఇది మీ జుట్టును బలపరుస్తుంది.
ఇందులో ఐరన్ కూడా ఉంటుంది, ఇది తలలో రక్త ప్రసరణను పెంచుతుంది, ఇది ఆక్సిజన్ సరిగ్గా జుట్టు కుదుళ్లకు చేరుకోవడానికి అనుమతిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది.

34

మునగాకును జుట్టుకు ఎలా అప్లై చేయాలి..?

ముందుగా ఒక గిన్నెలో 2 నుంచి 4 చెంచాల మొరింగ పొడిని జుట్టు పొడవును బట్టి వేయాలి.
దీని తరువాత, కలబంద మొక్క నుండి ఆకులను తీసి, వాటి పై తొక్క, జెల్ తీయండి.
రెండింటినీ బాగా మిక్స్ చేసి మూలాల నుండి జుట్టు పొడవు వరకు అప్లై చేయాలి.
ఈ హెయిర్ మాస్క్‌ను జుట్టు మీద సుమారు 1 గంట పాటు ఉంచండి.
ఇప్పుడు నీళ్ళు, షాంపూ సహాయంతో మీ జుట్టును కడిగి శుభ్రం చేసుకోండి.
ఈ విధంగా, మీరు ఈ రెమెడీని వారానికి కనీసం 1 నుండి 2 సార్లు ప్రయత్నించవచ్చు.
ఈ రెమెడీని నిరంతరం ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. వారు కూడా సరైన సంరక్షణ పొందుతారు.

44
grey hair

grey hair

మరి, తెల్ల జుట్టు కోసం మునగాకు ఎలా వాడాలి..?
మునగాకులో మనకు అవసరం అయ్యే చాలా పోషకాలు ఉంటాయి. మన జుట్టు తెల్లగా మారకుండా కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవే మన జుట్టు తెల్లగా మారకుండా సహాయపడతాయి. దీనిలో అమీనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి.. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడతాయి. దీనిలో బయోటిన్  కూడా ఉంటుంది. ఇది.. జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతుంది. మునగాకుల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి.  ఇవి.. జుట్టు పెరుగదలలో కీలక పాత్ర పోషిస్తాయి.  ఇవి మాత్రమే కాదు.. జింక్, విటమిన్ ఏ , ఐరన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.

తలకు ఎలా అప్లై చేయాలంటే…
మీరు ముందుగా మునగాకులను ఎండపెట్టాలి. తర్వాత దానిని పొడిగా చేసుకోవాలి.  ఈ పొడిని మీరు కొబ్బరి నూనె, ఆముదం ఇలా ఏదో ఒక నూనెలో ఈ పొడిని కలిపి తలకు పట్టించాలి. లేదంటే.. ఈ ఆకులను మీరు వాడే నూనెలో మరిగించి రాసుకున్నా పర్వాలేదు. ఇలా రెగ్యులర్ గా రాయడం వల్ల తెల్ల జుట్టు సమస్య ఉండదు.
మునగాకు పొడిని మీరు పెరుగులో కలిపి తలకు అప్లై చేయాలి. ఆ తర్వాత.. అరగంటకు తలస్నానం చేసినా కూడా తెల్ల జుట్టు సమస్య ఉండదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved