చలికాలంలో తలకు వేడి నూనె మసాజ్ చేస్తే ఏమౌతుంది..?
ఈ సీజన్ లో చర్మాన్ని , జుట్టును ఆరోగ్యంగా మార్చుకోవడానికి ఏం చేయాలో చూద్దాం..
చలికాలం వచ్చింది అంటే చాలు.. మన జుట్టు,చర్మం బాగా పాడైపోతాయి. చలికాలంలో చల్లటి గాలి, చల్లటి వాతావరణం కారణంగా చర్మం, జుట్టు పొడిబారిపోతాయి. చలిని తట్టుకోవడానికి మనం స్వెట్టర్లు లాంటివి ధరించవచ్చు. వాటి కారణంగా చలి కంట్రోల్ అవుతుంది కానీ, స్కిన్ మాత్రం డ్రైగానే మారుతుంది. మరి, ఈ సీజన్ లో చర్మాన్ని , జుట్టును ఆరోగ్యంగా మార్చుకోవడానికి ఏం చేయాలో చూద్దాం..
చలికాలంలో చర్మం లేదా జుట్టుకు పొడిగా ఉండకుండా ఉండేందుకు నూనెతో మసాజ్ చేయాలట. అది కూడా గోరువెచ్చని నూనెతో. ఇలా చేయడం వల్ల చర్మం పొడిగా ఉండదు.. దురద నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మరి.. జుట్టుకు ఇలా వేడి చేసిన నూనె రాస్తే ఏమౌతుందో తెలుసుకుందాం…
మీకు నచ్చిన ఏదైనా నూనెను తీసుకోండి, కొద్దిగా వేడి చేసి, ఆపై మీ జుట్టు మూలాల నుండి అప్లై చేయండి. ఇది మీ జుట్టుకు మంచిగా పోషణనిస్తుంది.తేమను అందిస్తుంది.జుట్టు మూలాల నుంచి బలపరుస్తుంది. వెచ్చని నూనె మీ జుట్టుకు షైన్, తేమను జోడించడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. జుట్టును రిపేర్ చేయడంలో సహాయపడటమే కాకుండా, చలికాలంలో జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది.
చుండ్రు సమస్యను దూరం చేస్తుంది
గోరువెచ్చని నూనెను తలపై అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. చుండ్రును తొలగిస్తుంది. ఇది మీ స్కాల్ప్‌ను బాగా తేమగా మార్చడంలో సహాయపడటమే కాకుండా, మెరిసే ,ఆరోగ్యకరమైన రూపాన్ని కూడా ఇస్తుంది.
వేడి నూనె చికిత్స జుట్టు లోతైన పోషణలో సహాయపడుతుంది, ఇది శీతాకాలంలో ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో జుట్టుకు వేడి నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు చాలా మృదువుగా కనిపిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది
జుట్టుకు ఇచ్చే వేడి నూనె మసాజ్ వల్ల తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది మూలాల నుండి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది తద్వారా జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. వారానికి రెండు, మూడుసార్లు ఇలా వేడి నూనెతో మసాజ్ చేయడం వల్ల.. జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.