మొదటి బిడ్డకీ.. రెండో బిడ్డకీ గ్యాప్ ఎంత ఉండాలి..?
దీని కోసం చాలా మంది.. గర్భనిరోదక మాత్రలను ఎంచుకుంటారు. లేదంటూ కండోమ్ ని ఆప్షన్ గా భావిస్తారు.
చాలా మందికి పెళ్లి వెంటనే పిల్లలను కనాలని ఉండదు. ఒకవేళ తొలి కాన్పు వెంటనే జరిగినా.. రెండో కాన్పుకు మాత్రం కచ్చితంగా గ్యాప్ తీసుకోవాలని అనుకుంటారు.
ఇంట్లో పెద్దవారు మాత్రం పిల్లలు కలిసి పెరుగుతారు.. వెంటనే కనేయండి అని చెబుతారు కానీ.. అదేమీ అంత మంచిది కాదట. పిల్లల మధ్య కచ్చితంగా గ్యాప్ ఉండాలట.
ముఖ్యంగా మొదటి కాన్పు మాత్రం 25ఏళ్ల కు జరిగితే.. రెండో కాన్పులు కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఆగిన పర్వాలేదట. అలా కాకుండా.. తొలి కాన్పే 30 దాటాక జరిగితే.. ఇక రెండో కాన్పు కోసం ఆగకపోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు.
pregnancy
ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారు... కాన్పుకీ. కాన్పుకీ కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
depression-during-pregnancy
కొందరు ఒక బిడ్డ జన్మించిన ఆరు నెలలకే మరో బేబీ కోసం ప్రయత్నిస్తారు. దీని వల్ల రెండో బిడ్డకు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ బరువుతో పుట్టడం లేదంటే.. లేదా ఇంకేదైనా సమస్యలు తలెత్తవచ్చట.
pregnancy
వెంటనే రెండో బిడ్డ కావాలి అనుకునేవారు అయినా కనీసం మొదటి బిడ్డ పుట్టిన 18 నుంచి 24 నెలల వరకు ఆగడం ఉత్తమమని సూచిస్తున్నారు.
pregnancy
మరి ఇలా బిడ్డకీ బిడ్డకు గ్యాప్ ఉండాలి అంటే.. కలయికకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదట. అలా అని.. కండోమ్ వాడటం, గర్భనిరోదక మాత్రలు కూడా వాడాల్సిన పనిలేదు.
స్త్రీలు వెంటనే బిడ్డలను కలగకుండా ఉండేందుకు ఈ లూప్ ని వేస్తారు. దీనిని ఐయూసీడీ( ఇంట్రాయూటెరిన్ కాంట్రా సెప్టివ్ డివైస్) అని అంటారు. అంటే గర్భాశయంలో అమర్చే గర్భనిరోధక సాధనం అని అర్థం.
ఇది అండం, వీర్యం కలవకుండా చేస్తుంది. ఫలోపియన్ గొట్టాల నుంచి అండం కిందకి రావడాన్ని ఆలస్యం చేస్తుంది. అండం గర్భసంచిలో కుదురుకోకుండా కాపాడుతుంది. ఇంగ్లీష్ టీ అక్షరం ఆకారంలో ఉంటుంది. ఇది చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది. ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. దీనికి పల్చటి రాగితీగ చుట్టి ఉంటుంది. ఇది వేయించుకున్నప్పటికీ కలయిక సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు.
లూప్ వేయించుకున్నాక ఏదైనా సమస్య ఉంటే.. రెండు, మూడు నెలల్లోనే అది బయటకు వస్తుంది. అలా రాలేదు అంటే.. ఎలాంటి సమస్య లేదని అర్థం. చాలా కొద్ది మందికి మాత్రమే లూప్ వేయించుకున్నాక నొప్పి ఉంటుంది. దానికి కొద్ది రోజులు మందులు వాడితే సరిపోతుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
కాకపోతే లూప్ వేయించుకున్నాక మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి దీనిని మార్చుకోవాల్సి ఉంటుంది. మళ్లీ పిల్లలు కావాలి అని అనుకున్నప్పుడు దానిని డాక్టర్ల సహాయంతో దానిని తీయించుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.