MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Saree Run: అమ్మాయి చీర కట్టి.. బుల్లెట్ నడిపితే ఆ గ్రేసే వేరు..!

Saree Run: అమ్మాయి చీర కట్టి.. బుల్లెట్ నడిపితే ఆ గ్రేసే వేరు..!

 ప్రముఖ బ్రాండ్ తనైరా, బెంగళూరుకు చెందిన జెజె యాక్టివ్ కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 3,120 మంది మహిళలు చీరలు ధరించి రన్నింగ్ చేయడం విశేషం. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 24 2025, 12:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
saree run

saree run

మహిళల ఆరోగ్యం, ఫిట్నెస్, సంప్రదాయాన్ని ప్రతిబంబిస్తూ హైదరాబాద్ మహానగరంలో స్పెషల్ గా శారీ రన్ నిర్వహించారు. ప్రముఖ బ్రాండ్ తనైరా, బెంగళూరుకు చెందిన జెజె యాక్టివ్ కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 3,120 మంది మహిళలు చీరలు ధరించి రన్నింగ్ చేయడం విశేషం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
saree run

saree run

నక్లెస్ రోడ్డులోని పీపుల్ ప్లాజా వద్ద ఈ శారీ రన్ ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంతో మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడంతోపాటు, మహిళా సాధికారతను ప్రోత్సహించే శక్తివంతమైన సందేశాన్ని  అందించారు. మొదట కొందరు మహిళలు బులెట్ బండి పై చీర కట్టుకొని నడపడం విశేషం. ఆ తర్వాత శారీ రన్ నిర్వహించారు

34
saree run

saree run

ఫిట్‌నెస్, సంప్రదాయ సమ్మేళనం
తనైరా శారీ రన్‌ను జెజె యాక్టివ్ కోచ్ ప్రమోద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆధునిక జీవనశైలిలో కూడా సంప్రదాయ వస్త్రధారణను ఎలా చొప్పించుకోవచ్చు అనే సందేశాన్ని స్ఫురింపజేశారు. చీర కేవలం ఒక వస్త్రం కాదు, అది బలం, వ్యక్తిత్వం, స్ఫూర్తి కి  (ప్రతీక). మహిళలను ఆరోగ్యాన్ని ప్రాధాన్యతనివ్వమని ప్రోత్సహించడంతో పాటు, వారు ఎదుర్కొనే సాంఘిక అడ్డంకులను అధిగమించేలా ప్రేరేపించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.

మహిళల కోసం ఓ శక్తివంతమైన వేదిక
ఈ కార్యక్రమం గురించి తనైరా సీఈఓ అంబుజ్ నారాయణ్ మాట్లాడుతూ, “తనైరా శారీ రన్ మహిళల బలం, సంప్రదాయం, ఆధునికత మధ్య ఉన్న అందమైన అనుసంధానాన్ని చూపిస్తుంది. మహిళలు తమ వారసత్వాన్ని గర్వంగా ధరిస్తూనే, ఆరోగ్యాన్ని కూడా సమానంగా ప్రాధాన్యతనివ్వాలి. చీర నేటి ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఎలా సరిపోతుందో ఈ కార్యక్రమం ద్వారా వెల్లడిస్తున్నాము” అని తెలిపారు.
 

44
saree run

saree run

జెజె యాక్టివ్ కోచ్ ప్రమోద్ మాట్లాడుతూ, “సామాన్యంగా మహిళలు తమ కుటుంబాల కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తారు. అయితే, తమ ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూసుకోవాలి. తనైరా శారీ రన్‌ వంటి కార్యక్రమాలు మహిళలకు ఆరోగ్యంపై దృష్టిపెట్టేలా ప్రోత్సహించడమే కాకుండా, ఒకరికొకరు మద్దతుగా నిలిచే వేదికగా మారుతున్నాయి” అని వివరించారు.

ఇప్పటికే బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాల్లో విజయవంతమైన తనైరా శారీ రన్, ఇప్పుడు హైదరాబాద్‌లోనూ విశేష స్పందన పొందింది. మహిళల ఆరోగ్యం, ఫిట్‌నెస్, సాధికారతపై శక్తివంతమైన సందేశాన్ని అందిస్తూ, ఈ కార్యక్రమం మరెందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Mangalsutra: డైలీవేర్ కి స్టైలిష్ మంగళసూత్రాలు, ఎంత బాగున్నాయో
Recommended image2
Jadau Earrings: గుండ్రని ముఖం ఉన్నవారికి సూటయ్యే ఇయర్ రింగ్స్ ఇవి
Recommended image3
Gold chain: మెడ నిండుగా కనిపించే గోల్డ్ చైన్స్..నక్లెస్ అవసరమే లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved