MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Woman
  • ముఖానికి తేనె పెడితే ఏమౌతుందో తెలుసా?

ముఖానికి తేనె పెడితే ఏమౌతుందో తెలుసా?

తేనె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. కానీ ఇది మన చర్మానికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అవును మీరు గనుక ముఖానికి తేనె పెట్టుకున్నారంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 28 2024, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తేనె ఒక నేచురల్ స్వీటెనర్. ఇది టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. తేనెను ఉపయోగించి మనం జలుబు నుంచి గొంతు నొప్పి వరకు ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. తేనె గాయాలను త్వరగా నయం చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాత్రిపూట బాగా నిద్రపట్టేలా చేస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


తేనె ఒంట్లో శక్తిని పెంచడం నుంచి అలెర్జీలు, చర్మ సంరక్షణ, సైనస్ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి, ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఇలా ఎన్నో విధాలుగా ఉపయోపడుతుంది. అయితే ఇది కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

నిజానికి తేనె మన చర్మానికి ఔషధం కంటే తక్కువేం కాదు. దీన్ని ఎన్నో రకాల ఫేస్ మాస్క్ ల్లో ఉపయోగిస్తారు. తేనెకున్న ప్రత్యేకత ఏంటంటే? దీన్ని రోజూ చర్మానికి ఉపయోగించొచ్చు.

అలాగే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. కానీ తేనెకు అలెర్జీ ఉన్నవారు మాత్రం ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే ముఖానికి తేనెను పెట్టాలి. అసలు ముఖానికి తేనెను పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

35

యాంటీ బాక్టీరియల్

తేనె మన చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది మన చర్మంపై ఉండే బ్యాక్టీరియాను చాలా వరకు తగ్గిస్తుంది. దీంతో మొఖంపై మొటిమలు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. మొటిమలతో బాధపడుతున్న వారికి తేనె మంచి మందులా పనిచేస్తుంది. 

ఎక్స్ఫోలియేటర్లు

తేనె మంచి ఎక్స్పోలియేటర్ గా కూడా పనిచేస్తుంది. తేనెలో ఉండే కొన్ని ఎంజైములు దీనిని నేచురల్ ఎక్స్ఫోలియేటర్ గా చేస్తాయి. దీన్ని  ముఖానికి, మొత్తం చర్మానికి అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ సమస్య తొలగిపోతుంది. అలాగే చర్మం నీరసంగా మారదు. అలాగే చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. లోపల ఉన్న కొత్త కణాలు బయటకు వచ్చి మీ చర్మం మెరిసెలా చేస్తుంది. 
 

45

యాంటీసెప్టిక్

మొటిమల సమస్యతో బాధపడుతున్న వారికి తేనె ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మొటిమలకు తేనెను అప్లై చేయడం వల్ల మీ ముఖంపై ఉన్న దుమ్ము, దూళి తొలగిపోతాయి. దీంతో బ్యాక్టీరియా నుంచి మీ ముఖం రక్షణ పొందుతుంది. తేనె మొటిమలకు యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది.

యాంటీ ఏజింగ్

తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీరాడికల్ డ్యామేజ్  నుంచి కాపాడుతాయి. ఇది చర్మాన్ని టైట్ గా, యవ్వనంగా ఉంచుతుంది. అలాగే వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. అలాగే ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. 

క్లియర్ చర్మం

ముఖానికి తేనెను పెట్టడం వల్ల చర్మంపై మూసుకుపోయిన రంధ్రాలను సహజంగా తెరుచుకుంటాయి. అలాగే ఇది చర్మాన్ని క్లియర్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే తేనె పిగ్మెంటేషన్, ముఖంపై ఉన్న మచ్చలను, మరకలను పోగొట్టి చర్మం మెరిసేలాచేస్తుంది. 
 

55


వడదెబ్బ ఉపశమనం

తేనె వడదెబ్బ వల్ల కలిగే నష్టం నుంచి మన చర్మాన్ని రక్షించడానికి, మంటను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే గాయాలు తొందరగా మానడానికి సహాయపడుతుంది. వడదెబ్బ వల్ల కలిగే డ్యామేజ్ నుంచి చర్మాన్ని నేచురల్ గా నయం చేయడానికి కూడా ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved