MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Woman
  • ముఖాన్ని ఎలా కడిగితే.. మెరుస్తూ, అందంగా కనిపిస్తారో తెలుసా?

ముఖాన్ని ఎలా కడిగితే.. మెరుస్తూ, అందంగా కనిపిస్తారో తెలుసా?

ముఖాన్ని రోజుకు నాలుగైదు సార్లు కడిగేవారు కూడా ఉన్నారు. కానీ మీరు అందంగా కనిపించాలంటే ముఖాన్ని ఎలా కడగాలో పూర్తిగా తెలుసుకోవాలి. లేదంటే ఎన్నిసార్లు కడిగినా డల్ గానే కనిపిస్తారు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 24 2025, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ముఖాన్ని కడగడానికి కూడా ఒక పద్దతి ఉందంటే నమ్ముతారా? కానీ నిజం. ముఖాన్ని సరైన పద్దతిలో కడిగితేనే మీరు అందంగా, కాంతివంతంగా కనిపిస్తారు. చాలా మంది ఆడవారు అందంగా, ఫ్రెష్ గా కనిపించాలని ముఖాన్ని నాలుగైదు సార్లు కడుగుతుంటారు. అయినా ముఖం మాత్రం అలాగే డల్ గా, కాంతిలేకుండా కనిపిస్తుంటుంది. నిజానికి ముఖాన్ని  సరైన పద్దతిలో కడిగితేనే మీరు అందంగా కనిపిస్తారు. అందుకే ముఖాన్ని ఎలా కడగాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చర్మ సంరక్షణ, మీరు చర్మాన్ని శుభ్రపరిచే విధానం బాగుంటే మొటిమలు తగ్గుతాయి. అలాగే ముడతలు, గీతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలు కూడా తగ్గుతాయి. ఇందుకోసం మీరు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కోసం పెద్దగా ఖర్చుచేయాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా మీరు మీ ముఖాన్ని సరిగ్గా కడుక్కుంటే ఏ చర్మ సమస్యలు రావు. అందుకే ముఖాన్ని ఎలా కడుక్కోవాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

36

ముఖాన్ని సరిగ్గా ఎలా కడగాలి? 

గోరువెచ్చని నీళ్లను ఉపయోగించాలి

ముఖాన్ని కడగడానికి ఎప్పుడూ కూడా గోరువెచ్చని నీల్లను ఉపయోగించాలి. ఎందుకంటే వార్మ్ వాటర్ చర్మ రంధ్రాలను తెరవడానికి, ముఖంపై పేరుకుపోయిన మురికిని, మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే ఈ వాటర్ మన చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. 

మృదువైన ఫేస్ వాష్ ను వాడాలి

ముఖాన్ని శుభ్రం చేయడానికి మైల్డ్ ఫేస్ వాష్ ను వాడండి. ఒకవేళ మీకు డ్రై స్కిన్ ఉంటే క్రీమ్ క్లెన్సర్ ను ఉపయోగించండి. అలాగే ఆయిలీ స్కిన్ ఉన్నా, మిశ్రమ చర్మం ఉన్నా జెల్ ఆధారిత క్లెన్సర్ ను వాడటం బెటర్. దీన్ని రోజుకు రెండు సార్లు వాడాలి. 
 

46


వారానికి ఒకసారి స్క్రబ్ చేయండి

ఎక్స్ఫోలియేటింగ్ రోజు చేయాల్సిన అవసరం లేదు. మీ ముఖాన్ని వారానికి ఒకసారి స్క్రబ్ చేస్తే సరిపోతుంది. స్క్రబ్బింగ్ లేదా వాష్క్లాత్ ను ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదు. 

శుభ్రం చేసిన తర్వాత టోనర్ అప్లై చేయండి

మీ ముఖాన్ని కడిగిన తర్వాత ఖచ్చితంగా టోనర్ ను రాయండి. ఎందుకంటే టోనర్లు మీ స్కిన్ పిహెచ్ సమతుల్యతను కాపాడుతాయి. 

మాయిశ్చరైజర్

ముఖాన్ని క్లీన్ చేసిన తర్వాత మాయిశ్చరైజింగ్ ను వాడాలి.  అప్పుడే పెడితే మీ చర్మం మాయిశ్చరైజర్ను పూర్తిగా గ్రహిస్తుంది. దీంతో మీ చర్మం హెల్తీగా ఉంటుంది. 

56

ఐ క్రీమ్

కళ్ల కింద ప్రాంతం సున్నితంగా ఉంటుంది. దీనికి అదనపు తేమ అవసరం. కాబట్టి మీ ముఖాన్ని శుభ్రం చేసిన తర్వాత ఐ క్రీమ్ ను ఖచ్చితంగా పెట్టాలి. 

సన్స్క్రీన్ ఉపయోగించాలి

యూవీ కిరణాల హానికరమైన ప్రభావాల వల్ల ఎన్నో చర్మ సమస్యలు వస్తాయి. అందుకే బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ ను వాడాలి. ఇది జిడ్డును కూడా తగ్గిస్తుంది. 

పడుకునే ముందు ముఖం కడుక్కోవాలి

ప్రతిరోజూ మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం. కాలుష్యం, చెమట, ముఖంపై మురికి పేరుకుపోయి ముఖకాంతి తగ్గుతుంది. మీరు ఇంటికి రాగానే పనులన్నింటినీ ముగించుకుని పడుకునే ముందు ముఖాన్ని ఖచ్చితంగా కడుక్కోవాలి. నూనెను జిడ్డుగా ఉన్న ప్రాంతాలపై సున్నితంగా రుద్ది ముఖానికి మసాజ్ చేయకుండా వేడి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.
 

66


ముఖాన్ని ఎలా కడుక్కోవాలి?

గోరువెచ్చని నీళ్లతోనే ముఖాన్ని కడగండి. అదే వేడి నీళ్లతో కడిగితే మీ చర్మం రక్షిత కొవ్వులను తొలగిస్తుంది. దీంతో మీ ముఖం పొడిబారుతుంది. చికాకు కలుగుతుంది. ముఖ్యంగా ముఖాన్ని తుడవడానికి శుభ్రమైన టవల్ ను మాత్రమే ఉపయోగించాలి. కానీ చాలా మంది బాత్రూమ్ లో సాధారణ హ్యాండ్ టవల్ ను ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని వాడకూడదు. 

ముఖాన్ని రోజుకు రెండు సార్లు మాత్రమే కడగాలి. ఎక్కువగా కడిగితే మీ ముఖం చికాకు కలుగుతుంది. ఇకపోతే ముఖాన్ని రోజుకు ఒకసారి మాత్రమే కడిగితే చెమట, ధూళి, మేకప్ అన్నింటినిటీ తొలగించడానికి రోజు చివర్లో ముఖాన్ని కడగండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved