రష్మిక నుంచి నయన్ వరకు.. వీళ్లంతా బ్రేక్ ఫాస్ట్ లో ఏం తింటారో తెలుసా?
హీరోయిన్ల అందానికి ఎవరైనా ఫిదాా అయిపోవాల్సిందే. వారి నటనకు ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో..వారి అందానికి, ఫిట్నెస్ కి కూడా అంతే ఫ్యాాన్స్ ఉంటారు. ముఖ్యంగా వాళ్లు తమ బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి ఏం తింటున్నారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. మరి, ఈ క్రేజీ హీరోయిన్స్ ఏం తింటారో ఓ లుక్కేద్దామా..
హీరోయిన్లు అందరూ.. తమ అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. తమ ఫిట్నెస్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫిట్నెస్ కేవలం.. వ్యాయామం చేయడంతో నే రాదు.. తీసుకునే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ ఆహారమే.. అందాన్ని కూడా అందిస్తుంది. సమంత, రష్మిక, నయనతార.. వీళ్లంతా.. తాము తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లోనే పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటారట. మరి.. ఏ హీరోయిన్ బ్రేక్ ఫాస్ట్ లో ఏం తింటుందో ఓ లుక్కేద్దామా..
సమంత తన బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా నట్స్,డ్రై ఫ్రూట్స్ తోపాటు తాజా పండ్లు తీసుకుంటారట. తన బ్రేక్ ఫాస్ట్ లో అరటి పండు,బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీలు లేదా ఇతర సీజనల్ ఫ్రూట్స్ భాగం చేసుకుంటుందట. ఇక బాదం, పిస్తా, చియా సీడ్స్ కూడా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటుందట.
ఫిట్నెస్ అనగానే వెంటనే గుర్తుకువచ్చే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆమె డెడికేషన్ లెవల్స్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అయితే.. రకుల్ ఎంత కఠినమైన వ్యాయామాలు చేసినా, దానికి తగినట్లు ఆహారం కూడా తీసుకుంటుందట. రకుల్ తన బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా స్మూతీ తీసుకుంటుందట.
ఈ స్మూతీ తయారు చేయడానికి ఆమె అందులో కొబ్బరి పాలు, మంచినీళ్లు,ప్రోటీన్ పౌడర్, అవిసె గింజలు, యాలకులు, అరటి పండు లాంటివి తీసుకుంటారు. వీటన్నింటినీ బ్లెండర్ లో వేసుకొని స్మూతీలాగా చేసుకుంటారు. చివరల్లో తేనె , చియా సీడ్స్ , ప్రోటీన్ పౌడర్ కలిపి తీసుకుంటారట.
రష్మిక మందన్న ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఆహారాన్ని ఎక్కువ ఇష్టపడతాను అని ప్రతిసారీ చెబుతూ ఉంటారు. ఒకసారి, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన అభిమానులతో ప్రత్యేక ఆమ్లెట్ రెసిపీని పంచుకుంది. పాలకూర, మష్రూమ్ లతో చేసే ఆమ్లేట్ అది. కొద్దిగా నువ్వుల నూనె వేయండి. తర్వాత గుడ్డులోని పచ్చసొనను వేరు చేసి బాగా కలిపి మరో పాన్ వేడి చేసి గుడ్డును వేయాలి. పైన పాలకూర , పుట్టగొడుగుల మిశ్రమాన్ని వేసి తక్కువ మంట మీద ఉడికించాలి. కొన్ని నిమిషాల్లో, మీ ప్రత్యేకమైన , ఆరోగ్యకరమైన ఆమ్లెట్ రెడీ అయినట్లే.
నయనతారతో సహా చాలా మంది సెలబ్రిటీలు తమకు కావాల్సిన పోషకాహారం అందేలా ప్రత్యేక డైట్‌లు పాటిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, నయనతార తన బ్రేక్‌ఫాస్ట్‌ను ప్రత్యేకమైన కొబ్బరి స్మూతీ రిసిపితో ప్రారంభిస్తుంది. కొబ్బరి స్మూతీ చేయడానికి, మీకు మంచినీరు, కొబ్బరి పాలు, చక్కెర, దాల్చిన చెక్క , యాలకుల పొడి అవసరం.
దీన్ని సిద్ధం చేయడానికి, ఒక పాత్రలో కొద్దిగా మంచినీరు, కొబ్బరి పాలు, చక్కెర, యాలకులు వేసి ఉండలు లేకుండా కలపాలి. తర్వాత చిటికెడు యాలకులు , దాల్చిన చెక్క పొడిని కొన్ని ఐస్ క్యూబ్స్‌తో కలపండి. నయనతారకు ఇష్టమైన కొబ్బరి స్మూతీ రెడీ అయినట్లే. కావాలంటే.. ఈ సెలబ్రెటీల హెల్దీ బ్రేక్ ఫాస్ట్ లు మీరు కూడా ప్రయత్నించవచ్చు.