పీరియడ్స్ నొప్పి వెంటనే తగ్గుతుంది.. వీటిని తింటే
నెలనెలా పీరియడ్స్ నొప్పితో విలవిలలాడేవారు చాలా మందే ఉంటారు. అయితే ఈ సమయంలో కొన్ని రకాల ఆహారాలను తింటే గనుక పీరియడ్స్ నొప్పి కొద్దిసేపటికి తగ్గిపోతుంది. అవేంటంటే?
ప్రతినెలా పీరియడ్స్ రావడం చాలా కామన్. అయితే కొంతమందికి మాత్రం ఈ సమయంలో విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఇదొక సర్వ సాధారణ సమస్య. ఇదొక్కటే కాదు తిమ్మిరి, బలహీనంగా కూడా అనిపిస్తుంటుంది. కానీ వీటివల్ల రోజువారి పనులను కూడా చేసుకోలేరు. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే మాత్రం ఈ నొప్పి కొద్దిసేపటికి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
అల్లం
అల్లాన్ని ఎన్నో ఏండ్లుగా పీరియడ్స్ తిమ్మిరి, కడుపు నొప్పితో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఈ అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ గర్భాశయంలోని కండరాల సంకోచాలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఇది పీరియడ్స్ తిమ్మిరితో సంబంధం ఉన్న నొప్పిని కూడా తగ్గిస్తుంది. పీరియడ్స్ నొప్పి వెంటనే తగ్గాలంటే మీ ఆహారంలో అల్లాన్ని చేర్చుకోవచ్చు. లేదా అల్లం టీ తాగొచ్చు.
పసుపు
పసుపులో కూడా ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిని ఉపయోగించి మనం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. పసుపులో ఉండే శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలు రుతుక్రమ తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడతాయి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం నొప్పిని, మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. కడుపు నొప్పి వెంటనే తగ్గాలంటే మీరు తినే ఆహారంలో పసుపును చేర్చొచ్చు లేదా పసుపు పాలు తాగొచ్చు.
కొవ్వు చేపలు
సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి ఫ్యాటీ చేపల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. మీరు పీరియడ్స్ టైంలో ఫ్యాటీ ఫిష్ ను తింటే తిమ్మిరి త గ్గుతుంది. అలాగే నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందుతారు.దీన్ని వేయించి లేదా ఉడకబెట్టి పులుసు చేసుకుని తినొచ్చు.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్లు టేస్టీగా ఉంటాయి. అంతేకాదు ఇవి మన ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ చేపల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలను సడలించడానికి, పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అంతేకాదు ఈ డార్క్ చాక్లెట్ ఎండార్ఫిన్ల విడుదల అయ్యేలా చేసి నొప్పిని తగ్గిస్తుంది. పీరియడ్స్ నొప్పిని వెంటనే తగ్గించుకోవాలంటే డార్క్ చాక్లెట్ ను తినండి.
ఆకుకూరలు
ఆకుకూరలు కూడా పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. బచ్చలికూర, కాలే, స్విస్ చార్డ్ వంటి ఆకుకూరలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పీరియడ్స్ తిమ్మిరిని, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. ఈ ఆకు కూరల్లో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఇ లు కూడా ఉంటాయి. ఇవి శరీర మంటను, కండరాల నొప్పులను తగ్గిస్తాయి.