మేకప్ తో పని లేదు.. ఇదొక్కటి ముఖానికి వారం రోజులు రాస్తే చాలు..!
కేవలం మన కిచెన్ లో లభించే కేవలం ఒకే ఒక్క కూరగాయతో అందం పెంచుకోవచ్చు.. అది మరేంటో కాదు..బంగాళదుంప.
అందంగా కనిపించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే అందంగా కనిపించాలి అంటే.. మేకప్ వేసుకోక తప్పదు అని చాలా మంది ఫీలౌతూ ఉంటారు. కానీ.. మేకప్ తో పని లేకుండా..కేవలం మన కిచెన్ లో లభించే కేవలం ఒకే ఒక్క కూరగాయతో అందం పెంచుకోవచ్చు.. అది మరేంటో కాదు..బంగాళదుంప.
మీకు నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. మీరు బంగాళదుంపతో మీ అందాన్ని పెంచుకోవచ్చు. దీనిలో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మన స్కిన్ ని హైడ్రేటింగ్ గా ఉంచడంలోనూ సహాయం చేస్తాయి. బ్లీచింగ్ లక్షణాలు కూడా ఉండటం వల్ల… మీ ముఖం పై నల్ల మచ్చలు తొలగించడంతో పాటు.. మెటిమల మచ్చలు, టాన్ కూడా తొలగిపోయేలా చేస్తుంది.
వయసు పెరుగుతుంటే మన ముఖంపై ముడతలు రావడం సహజం. అయితే.. ఈ బంగాళ దుంపను డైరెక్ట్ గా ముఖంపై రుద్దడం వల్ల.. ఆ సమస్య తగ్గుతుంది. మన స్కిన్ ని మృదువుగా మారుస్తుంది. బంగాళాదుంప రసం, పేస్ట్ లేదా మాస్క్‌గా ఉపయోగించినా..పిగ్మెంటేషన్ ,పొడిబారడం వంటి వివిధ రకాల చర్మ సమస్యలను పరిష్కరించగలవు. మరి, ఈ బంగాళ దుంపను ముఖానికి ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం…
1.మెరిసే చర్మం కోసం…
బంగాళాదుంపలను తురిమి.. దాని రసాన్ని పిండండి.
కాటన్ బాల్ ఉపయోగించి రసాన్ని మీ ముఖానికి అప్లై చేయండి.
గోరువెచ్చని నీటితో కడిగే ముందు సుమారు 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఇది నల్లటి మచ్చలను తేలికపరచడానికి, మీ చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది.
2.పిగ్మెంటేషన్ పోవాలంటే…
చిన్నగా ఉడికించిన బంగాళాదుంపను మెత్తగా చేసి, ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలపండి.
మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి.
గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ మాస్క్ పొడి చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.
3.ట్యాన్ తొలగించడానికి…
ఒక బంగాళాదుంపను తురుమి దానితో చిటికెడు పసుపు పొడి కలపండి.
ఈ పేస్ట్‌ను మీ ముఖం లేదా టాన్ అయిన ప్రాంతాలకు అప్లై చేయండి.
కడిగే ముందు 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఇది చర్మంపై ఉన్న టాన్‌ను తగ్గిస్తుంది
4.కంటి కింది నలుపు పోవాలంటే..
బంగాళాదుంపలను సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి.
ముక్కలను మీ మూసిన కనురెప్పలపై 10-15 నిమిషాలు ఉంచండి.
బంగాళాదుంపలు వాటి శీతలీకరణ, శోథ నిరోధక లక్షణాల కారణంగా కళ్లు ఉబ్బడం తగ్గడంతో పాటు.. నల్లటి వలయాలు కూడా పోతాయి. మీ ముఖం అందంగా కనపడుతుంది.