ముఖం పై మొటిమలా..? టీనేజీ అమ్మాయిలు ఫాలో కావాల్సిన టిప్స్ ఇవే..
చర్మం అందంగా ఉండాలంటే.. ముందుగా.. క్లెన్సింగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. రోజుకి రెండు పూటల ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఈ కాలం అమ్మాయిలు ఎక్కువగా స్కిన్ కేర్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖం పై ట్యాన్ పేరుకు పోవడం.. మొటిమలు రావడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
ఈ సమస్యల నుంచి బయటపడాలంటే.. అమ్మాయిలు కొన్ని రకాల స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
చర్మం అందంగా ఉండాలంటే.. ముందుగా.. క్లెన్సింగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. రోజుకి రెండు పూటల ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత టోనర్ అప్లై చేయాలి.. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
అంతేకాకుండా.. ముఖాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటేడ్ గా ఉంచుకోవాలి. హైడ్రేటెడ్ గా ఉండే మాయిశ్చరైజర్ ని ఎంచుకోవాలి. దాని వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. స్కిన్ డ్రైగా మారకుండా సహాయం చేస్తుంది.
అది మాత్రమే కాకుండా... ప్రతిరోజూ 8 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది. సీజన్ కి తగిన పండ్లు, కూరగాయలు తినాలి. ముఖ్యంగా కీరదోస, టమాట, వాటర్ మిలన్ తినాలి. వీటిని మీ డైట్ లో కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉన్నా సరే... స్నానం చేసిన తర్వాత.. రాత్రి పడుకునే ముందు కచ్చితంగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. బాడీ బటర్ క్రీమ్ ఉపయోగించడం ఉత్తమం.
ఆయిల్ ప్రొడక్ట్స్ కి టీనేజర్స్ దూరంగా ఉండటం మంచిది. లేదంటే.. ముఖంపై మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది.
ఇక ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే.. కచ్చితంగా ముఖానికి, చేతులకు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం తప్పనిసరి. ఇక పెదాలకు లిప్ స్టిక్ కాకుండా లిప్ బామ్ వాడటం ఉత్తమం. దాని వల్ల పెదాలు పాడవ్వకుండా ఉండటంతోపాటు.. మృదువుగా ఉంటాయి.
ఇక కళ్లచుట్టూ ఉబ్బినట్లుగా, నల్లటి వలయాలు రావడం మొదలైతే.. దానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ల చుట్టూ ఐస్ క్యూబ్ రుద్దడం చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
టీవీ చూడటం, మొబైల్ ఫోన్స్ చూడటం కూడా తగ్గించాలి. ఇక టీనేజర్స్ కి చర్మం చాలా లేతగా ఉంటుంది కాబట్టి.. బయట కెమికల్స్ ఉండే ప్రోడక్ట్స్ కాకుండా.. నేచురల్ ప్రోడక్డ్స్ వాడటం ఉత్తమమైన మార్గం.