ముఖం కళ తప్పుతోందా..? ఈ మిస్టేక్స్ చేయకండి..!
చాలా మందికి ఉదయం లేవగానే.. నీటితో ముఖం శుభ్రం చేసుకునే అలవాటు ఉండదు. ఎలాగూ స్నానం చేస్తాం కదా.. అప్పుడు శుభ్రం చేసుకోవచ్చులే అని వదిలేస్తారు.
ప్రస్తుతం మనలో చాలా మందికి ఆఫీసులు లేవు. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించారు. విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలు లేవు.. కేవలం ఆన్ లైన్ క్లాసెస్. దీంతో.. ఇళ్లకే పరిమితం అయిపోయాం. బయట వాయు కాలుష్యం గొడవ లేదు.. ఇంట్లోనే ఉంటున్నాం.. ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకుంటున్నాం. అయినా.. ఎందుకో ముఖంలో కళ తప్పుతోంది..
మీది కూడా ఇదే సమస్యా..? తెలియకుండానే మనం చేసే కొన్ని తప్పుల కారణంగా.. ఈ రకం సమస్యలు మొదలైతాయి. మరి ఎలాంటి సమస్య లేకుండా.. మన ముఖం, చర్మం అందంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...
చాలా మందికి ఉదయం లేవగానే.. నీటితో ముఖం శుభ్రం చేసుకునే అలవాటు ఉండదు. ఎలాగూ స్నానం చేస్తాం కదా.. అప్పుడు శుభ్రం చేసుకోవచ్చులే అని వదిలేస్తారు. అది మంచి పద్దతి కాదట. ఉదయం లేవగానే చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
మనం నిద్రపోయినప్పుడు.. చర్మం తనంతట తానే రిపైర్ చేసుకుంటుందట. ఆ సమయంలో.. ముఖంపై మలినాలు పేర్కొంటాయి. కాబట్టి.. ఉదయాన్నే నీటితో శుభ్రం చేసుకోవాలి. అప్పుడు.. ముఖం తాజాగా ఉంటుంది. ఇలా శుభ్రం చేసుకోకుంటే ముఖంపై మొటిమలు రావడం లేదా.. ముఖం జిడ్డుగా కనపడటం లాంటివి జరుగుతాయి.
ఇక చాలా మంది బయటకు వెళ్లేటప్పుడు మాత్రమే సన్ స్క్రీన్ రాసుకోవాలి అనుకుంటారు. అయితే.. ఇంట్లో ఉన్న సమయంలోనూ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలట
సూర్య రశ్మి.. ఇంట్లో ని కిటికీల నుంచి కూడా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. దానిని రాసుకోవాలి. కేవలం ఎండాకాలమే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి అనే రూల్ ఎక్కడా లేదు. కాబట్టి.. ఏ కాలంలోనైనా రాసుకోవచ్చు.
ఇక చాలా మంది.. దిండ్లు, దుప్పట్లు మార్చకుండా.. వాటినే వాడుతూ ఉంటారు. వాటి కారణంగా కూడా ముఖంపై దద్దుర్లు, ఎలర్జీ వంటివి వచ్చే అవకాశం ఉంటుందట.
రాత్రి పడుకునే ముందు స్కిన్ కేర్ ఫాలో కాకపోవడం వల్ల కూడా చర్మం పాడయ్యే ప్రమాదం ఉంది. రాత్రి పడుకునేముందు మర్చిపోకుండా.. ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. స్కిన్ టోనర్, సీరమ్, లోషన్ వంటివి రాసుకోవాలి. ఇవన్నీ ఫాలో అయితే.. చర్మం అందంగా ఉంటుంది.