MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • జుట్టు నూనె నూనె ఉంటే ఏం చేయాలి?

జుట్టు నూనె నూనె ఉంటే ఏం చేయాలి?

కొంతమంది జుట్టు బాగా ఆయిలీగా ఉంటుంది. దీనివల్ల స్నానం చేసినా.. చేయనట్టే కనిపిస్తుంది. దీనివల్ల జుట్టు జిగటగా మారుతుంది. ఇలాంటి సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలుసా? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 22 2024, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆడవాళ్లైనా, మగవారైనా జుట్టు ఒత్తుగా, నల్లగా, హెల్తీగా ఉండాలని కోరుకుంటారు. ఇలా మీరు కోరుకున్నట్టు మీ జుట్టు ఉండాలంటే జుట్టు సంరక్షణ ఖచ్చితంగా ఉండాలంటారు నిపుణులు. అయితే చాలా మంది జుట్టును సరిగ్గా చూసుకోకపోవడంతో నెత్తిమీద చుండ్రు, డ్రై హెయిర్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు వస్తాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ముఖ్యంగా కొంతమంది జుట్టు ఎప్పుడూ జిడ్డుగానే కనిపిస్తుంది. స్నానం చేసినా.. జుట్టులో నూనె కనిపిస్తుంటుంది.దీనివల్ల జుట్టు హెల్తీగా కనిపించదు. ఎప్పుడూ నూనె నూనె కనిపించడం వల్ల జుట్టు అందంగా కూడా కనిపించదు.

ఎందుకంటే నెత్తిమీద ఎక్కువ నూనె వల్ల జుట్టు మురికిగా కనిపిస్తుంది. అలాగే దీనికి దుమ్ము, దూళి కణాలు కూడా అంటుకుంటాయి. దీనివల్ల నెత్తిమీద చుండ్రు ఏర్పడుతుంది. విపరీతంగా దురద పెడుతుంది. అందుకే ఈ అదనపు నూనెను తొలగించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

35
Image: Getty

Image: Getty

హెయిర్ వాష్

ఆయిలీ జుట్టు చాలా తొందరగా మురికిగా మారుతుంది. ఎందుకంటే ఆయిలీ జుట్టుకు దుమ్ము, ధూళి బాగా అంటుకుంటాయి. వీటివల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతినడంతో పాటుగా హెయిర్ ఫాల్ కూడా వస్తుంది. దీనికోసమని చాలా మంది ప్రతిరోజూ లేదా రోజు తప్పించి రోజు షాంపూతో తలస్నానం చేస్తుంటారు. కానీ జుట్టును ప్రతిరోజూ షాంపూతో క్లీన్ చేయకూడదు.

 ఎందుకంటే దీనివల్ల కూడా నెత్తిమీద ఎక్కువ నూనె ఉత్పత్తి అవుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి వారానికి 2 సార్లు షాంపూతో తలస్నానం చేయండి. ఇంతకంటే ఎక్కువ సార్లు తలస్నానం చేస్తే జుట్టులో నూనె ఎక్కువగా పేరుకుపోతుంది. అలాగే మీ జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల మీరు మీ జుట్టును నచ్చిన విధంగా స్టైల్ చేయలేరు. 
 

45
Image: Getty

Image: Getty

సరైన కండీషనర్ 

యాడ్స్, వేరేవాళ్లు చెప్పిన చిట్కాలను చాలా మందికి ఫాలో అయ్యే అలవాటు ఉంటుంది. కానీ వీటివల్ల జుట్టు బాగా దెబ్బతింటుంది. ఏదైనా సరే అది జుట్టుకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అని తెలుసుకున్న తర్వాతే ఉపయోగించాలంటారు నిపుణులు. 

ముఖ్యంగా చాలా మంది కండిషనర్లలో ఎక్కువ తప్పులు చేస్తుంటారు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం తలకు సరైన కండీషనర్ ను ఉపయోగించాలి. అలాగే దీన్ని నెత్తిమీద అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే కండీషనర్ నెత్తిని జిగటగా మారుస్తుంది. అలాగే మురికిగా అయ్యేలా చేస్తుంది. కాబట్టి జుట్టుకు సరిపోయే మంచి కండీషనర్ ను ఉపయోగించండి. 
 

55
Image: Getty

Image: Getty

ఈ చిట్కాలను పాటిస్తే మీ జుట్టు జిగటగా, జిడ్డుగా కనిపించదు. అలాగే నెత్తిమీద చుండ్రు తగ్గుతుంది. జుట్టు రాలడం కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అయితే ఇందుకోసం ఈ చిట్కాలను సరైన పద్దతుల్లో పాటించాలని నిపుణులు చెబుతున్నారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved