MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఇదొక్కటి పెట్టినా.. నల్లగా ఉన్న మెడ తెల్లగా అవుతుంది

ఇదొక్కటి పెట్టినా.. నల్లగా ఉన్న మెడ తెల్లగా అవుతుంది

ఆడవాళ్లే ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. నల్లగా ఉన్న మెడను మితగా స్కిన్ కలర్ లోకి తేవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆ రంగు మాత్రం అలాగే ఉంటుంది. కానీ కొన్నిచిట్కాలతో నల్లగా ఉన్న మెడను తెల్లగా చేయొచ్చు. అదెలాగంటే?

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 06 2024, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒక్క ఆడవారే కాదు మగవారు కూడా కేవలం ముఖం అందంగా ఉందా? లేదా? అనే దానిమీదనే ఎక్కువ శ్రద్ధ చూపుతారు. కానీ మెడ సంరక్షణ మాత్రం మర్చిపోతుంటారు. అందుకే చాలా మంది మెడ మాత్రం మిగతా చర్మం కంటే కాస్త నల్లగా ఉంటుంది. 

దుమ్ము, ధూళి, ఎండ వంటి కారణాల వల్ల మెడ నల్లగా అవుతుంది. కానీ ఇది అందవికారంగా కనిపిస్తుంది. దీనివల్ల నలుగురిలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో నల్లగా ఉన్న మెడను తిరిగి తెల్లగా చేయొచ్చు. అదెలాగంటే? 

 

25

నల్లటి మెడని శుభ్రం చేసే చిట్కాలు:

పెరుగు, నిమ్మరసం 

పెరుగు, నిమ్మరసం నల్లగా ఉన్న మెడను తిరిగి తెల్లగా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మెడ నలుపును పోగొట్టడానికి కొంచెం పెరుగును తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం వేసి బాగా కలపండి. దీన్ని మెడకు అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి. ఇలా మీరు వారానికి రెండు సార్లు చేస్తే మీ మెడ నలుపు పోయి తెల్లగా అవుతుంది. 

బొప్పాయి, పెరుగు

నల్లగా ఉన్న మెడను తెల్లగా చేయడానికి మీరు బొప్పాయి, పెరుగును కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం బాగా పండిన బొప్పాయి గుజ్జును తీసుకుని దీంట్లో రెండు చెంచాల పెరుగును వేసి బాగా కలపండి. దీన్ని మెడకు రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. 5 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

35

కలబంద 

నల్లగా ఉన్న మెడను తిరిగి తెల్లగా చేయడానికి కలబంద కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం కలబంద గుజ్జును ప్రతిరోజూ మెడకు రాస్తే సరిపోతుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తే నలుపు రోజు రోజుకు పూర్తిగా తగ్గిపోతుంది. 

బంగాళదుంప రసం

బంగాళాదుంప రసాన్ని కూడా మీరు మెడ నలుపును పోగొట్టడానికి వాడొచ్చు. మీరు గనుక ఆలుగడ్డ రసాన్ని మెడకు రాస్తే నలుపు త్వరగా తొలగిపోతుంది. ఇందుకోసం బంగాళదుంప రసాన్ని తీసి మెడుకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయండి. కావాలంటే బంగాళదుంప రసంలో నిమ్మరసాన్ని కలిపి మెడకు పెట్టొచ్చు. ఇది కూడా నలుపును తొందరగా పోగొట్టడానికి సహాయపడుతుంది. 

45

శెనగపిండి, పసుపు

మెడపై ఉన్న నలుపును పోగొట్టడంలో శెనగపిండి, పసుపు  చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం శెనగపిండిలో పసుపు, పెరుగును వేసి బాగా కలపండి. దీన్ని మెడకు రాసి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి.తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి. ఇలా మీరు వారానికి మూడు సార్లు చేస్తే మెడ నలుపు పూర్తిగా తగ్గిపోతుంది.  

తేనె, నిమ్మరసం

మెడ నలుపును పోగొట్టడంలో తేనె, నిమ్మరసం కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం నిమ్మరసంలో కొంచెం తేనె కలిపి మెడకు అప్లై చేయండి. ఒక 15 నిమిషాల తర్వాత వాటర్ తో కడిగేయండి. ఇలా మీరు వారానికి రెండు సార్లు చేస్తే మెడ నలుపు తగ్గిపోతుంది.

55

పసుపు, పాలు

పాలు, పసుపుతో కూడా నల్లగా ఉన్న మెడను తెల్లగా చేయొచ్చు. ఇందుకోసం ఒక చెంచా పాలలో చిటికెడు పసుపును వేసి పేస్ట్ లా చేయండి. దీన్ని మెడకు అప్లై చేయండి. ఒక 15 నిమిషాల తర్వాత కొద్దిగా తడిపి రుద్దుతూ కడిగేయండి. ఇలా ఏడు రోజులు చేస్తే మెడ నలుపు పూర్తిగా తొలగిపోతుంది. 

 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pendant: సింపుల్ చైన్ కి రాయల్ లుక్ ఇచ్చే జాడు పెండెంట్..
Recommended image2
Gold Plated Earrings: బడ్జెట్ ధరలో బంగారంలా మెరిసే ఇయర్ రింగ్స్..
Recommended image3
Hair Growth: రోజూ ఇవి తింటే.. ఒత్తైన జుట్టు మీ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved