రాత్రిపూట జుట్టుకు నూనె పెడితే ఏం జరుగుతుందో తెలుసా?
చాలా మంది రాత్రిపూట జుట్టుకు నిండుగా కొబ్బరి నూనెను పెట్టేసి ఉదయాన్నే తలస్నానం చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
Image: Getty
పొడవాటి, ఒత్తైనా, హెల్తీ జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం ఎన్నో చేస్తుంటారు. వీటిలో రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టడం కూడా ఉంది. కానీ రాత్రిపూట తలకు నూనె పెట్టొచ్చా? అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది.
నిజానికి జుట్టుకు నూనె పెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నూనె జుట్టు కుదుళ్లకు మంచి పోషణను ఇస్తుంది. వెంట్రుకలను నల్లగా చేస్తుంది. జుట్టు ఊడిపోకుండా చేయడానికి సహాయపడుతుంది.
కానీ జుట్టుకు రాత్రిపూట నూనె పెట్టడం మాత్రం మంచిది కాదని నిపుణులు అంటున్నారు.చాలా మంది రాత్రి పూట తలకు నూనె పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేస్తుంటారు. కానీ దీని వల్ల కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే?
రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టి అలాగే ఉంచడం వల్ల దానికి దుమ్ము, ధూళికణాలు అంటుకుంటాయి. దీనివల్ల మీ నెత్తిమీద రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో నెత్తిమీద చుండ్రు ఏర్పడుతుంది. అలాగే జుట్టు విపరీతంగా రాలుతుంది.
అలాగే వెంట్రుకలు తెగిపోవడం, చీలిపోవడం వంటి జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి. నూనె మీ జుట్టు జిడ్డుగా, బూడిద రంగులో కనిపించేలా చేస్తుంది. ఇది మీ జుట్టును స్టైల్ చేయడం కష్టతరం చేస్తుంది.
మొటిమలు
జుట్టుకు నూనె పెట్టుకుని నిద్రపోతున్నప్పుడు జుట్టు నుంచి నూనె మీ ముఖం, మెడకు ప్రవహిస్తుంది. దీనివల్ల మీ ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. ఉన్న మొటిమలు మరింత ఎక్కువ అవుతాయి. మీకు సున్నితమైన చర్మం లేదా మొటిమలు ఉంటే మీరు రాత్రిపూట జుట్టుకు ఎట్టి పరిస్థితిలో నూనె పెట్టకండి.
జుట్టు రాలడం
నిజానికి జుట్టుకు నూనె పెడితే జుటు మూలాలు బలంగా అవుతాయి. కానీ జుట్టులో నూనెను ఎక్కువసేపు ఉంచడం వల్ల మీ జుట్టు కుదుళ్లు బరువు తగ్గుతాయి. అలాగే అవి బలహీనంగా మారుతాయి. దీంతో మీ జుట్టు విపరీతంగా రాలడం మొదలవుతుంది. అలాగే కాలక్రమేణా మీ జుట్టు పల్చగా అవుతుంది.
Image: FreePik
లింప్ హెయిర్
రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టడం వల్ల మీ జుట్టు జిడ్డుగా మారుతుంది. అలాగే బూడిద రంగులో కనిపిస్తుంది. రానురాను మీ జుట్టు తెల్లగా అయ్యేలా చేస్తుంది.దీనిని లింప్ హెయిర్ అంటారు. ఎందుకంటే అదనపు నూనె నెత్తిమీద పేరుకుపోతుంది. ఇది మీ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
మూసుకుపోయిన రంధ్రాలు
రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టడం వల్ల నెత్తిమీది రంధ్రాలు మూసుకుపోతాయి. అంతేకాదు నెత్తిమీద విపరీతంగా దురద పెడుతుంది. చుండ్రు కూడా ఏర్పడుతుంది. క్లినికల్ అధ్యయనాలు ఇది కొత్త జుట్టు పెరుగుదలను నిరోధించగలదని, నెత్తిమీద మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని సూచిస్తున్నాయి.
జుట్టుకు నూనె పెట్టడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నప్పటికీ.. రాత్రిపూట జుట్టుపై నూనె పెట్టడం వల్ల ఎన్నో నష్టాలు కలుగుతాయి. అందుకే రాత్రిపూట మాత్రం జుట్టుకు నూనె పెట్టకండి. జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి జుట్టుకు నూనె పెట్టిన రెండు మూడు గంటల్లోనే తలస్నానం చేయండి.