MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • పీరియడ్ ప్యాడ్స్ ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకోవాలి..?

పీరియడ్ ప్యాడ్స్ ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకోవాలి..?

ఈ పీరియడ్స్ సమయంలో సరైన శుభ్రత పాటించకపోవడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి

2 Min read
Author : ramya Sridhar
| Updated : Oct 21 2024, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Sanitary pads

Sanitary pads

పీరియడ్స్ మహిళలను ప్రతి నెలా పలకరిస్తూనే ఉంటాయి. పీరియడ్స్ లో వచ్చే నొప్పి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ పీరియడ్స్ సమయంలో సరైన శుభ్రత పాటించకపోవడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే రెగ్యులర్ గా ప్యాడ్స్ మారుస్తూ ఉండాలి. ప్యాడ్స్ మారుస్తూ ఉండకపోతే.. ఆ ప్రదేశంలో దద్దుర్లు, అసౌర్యం కలుగుతుంది. అంతేకాదు.. అంతకన్నా పెద్ద సమస్యలు కూడా వస్తాయి.  ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

 

ఈ రోజుల్లో పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ వాడటం అందరూ చేస్తున్నారు. కానీ.. ప్యాడ్ ని ఎన్ని గంటలకు మార్చాలి అనే విషయంలో మాత్రం క్లారిటీ ఉండటం లేదు. చాలా మంది ఎక్కువ గంటలు ప్యాడ్ ఉంచుకోవడం వల్ల చాలా రకాల అంటు వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే..శానిటరీ నాప్ కిన్ ని ఎంతసేపు ఉంచాలి అనే విషయం తెలుసుకోవాలి.


శానిటరీ నాప్‌కిన్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. సంతానోత్పత్తి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. 

 

34

 

వాసన

దుర్వాసన అనేది ప్రతి స్త్రీ ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్యలలో ఒకటి. యోని నుండి రక్తం బయటకు వచ్చినప్పుడు, అది బ్యాక్టీరియా, శ్లేష్మం, వివిధ శరీర ద్రవాలతో కలిసిపోతుంది. ఎక్కువసేపు ప్యాడ్‌ ఉంచుకోవడం వల్ల అది తడిగా, కుళ్ళిన వాసనకు దారి తీస్తుంది. తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో దద్దుర్లు వస్తాయి.  ఎక్కువ సేపు శానిటరీ నాప్‌కిన్ ధరించడం వల్ల రక్తంతో పాటు వెలువడే బ్యాక్టీరియా పేరుకుపోతుంది.



 

రక్తస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ప్యాడ్స్ మారుస్తూ ఉండాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. రక్తస్రావం ఎక్కువగా అవ్వకపోయినా సరే… ప్రతి 3-4 గంటలకు ప్యాడ్ లు మారుస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా మార్చడం వల్ల బ్యాక్టీరియా పేరుకుపోకుండా, దుర్వాసన రాకుండా చేస్తుంది. మీకు ఎక్కువ ప్రవాహం ఉంటే, మీరు లీక్ కాకుండా చూసుకోవడానికి ప్యాడ్‌లను తరచుగా మార్చాల్సి ఉంటుంది.

 

44

 

కేవలం శానిటరీ ప్యాడ్‌లు మాత్రమే కాదు, టాంపాన్‌లు, మెన్‌స్ట్రువల్ కప్పులతో కూడా తరచుగా మార్పులు చేయడం ముఖ్యం. యోనిలో మరచిపోయిన టాంపోన్‌లు టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అని పిలువబడే ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్లకు దారితీయవచ్చు. టాంపాన్‌లు లేదా మెన్‌స్ట్రువల్ కప్పులను కనీసం ప్రతి 8-10 గంటలకు మార్చాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. .


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaishnavi Sony: ఫోక్ సాంగ్స్ తో అదరగొడుతున్న తెలంగాణ పిల్ల, మరో నాగదుర్గ కానుందా?
Recommended image2
Jhumka Designs: స్టోన్ వర్క్ తో డబుల్ లేయర్ జుంకా డిజైన్లు.. చూసేయండి
Recommended image3
Gold Ring: 3 గ్రాముల్లోనే గోల్డ్ రింగ్ డిజైన్స్ బడ్జెట్ లో లగ్జరీ లుక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved