6నెలల్లో 12కేజీలు తగ్గిన షెహనాజ్.. సీక్రెట్ డ్రింక్ ఇదేనట..!
సన్నగా మారిన తర్వాత.. ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తూనే ఉంది. కాగా... లాక్ డౌన్ సమయంలో ఆమె అంత బరువు ఎలా తగ్గిందో.. ఇటీవల రివీల్ చేసింది.
టెలివిజన్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే. ఈ షో మొదట మొదలైంది హిందీలో. కాగా.. ఆ షో లో పాల్గొని ఫేమస్ అయిన వారిలో షెహనాజ్ గిల్ కూడా ఒకరు.
ఆ షోలో సిద్దార్థ్ శుక్లా- షెహనాజ్‌తొలిసారిగా బిగ్‌బాస్ హోస్‌లోనే కలుసుకున్నారు. అలా మొదలైన వారి పరిచయం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది. హోస్‌లో ఇద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేవారు. ఇక షెహనాజ్ సిద్ధార్థ్ విషయంలో ఎంతో పొసేసివ్‌గా ఉండేది. సిద్ధార్థ్ ఏ అమ్మాయితో అయినా కాస్త ప్రేమగా మాట్లాడినా సహించేది కాదు. సిద్ధార్థ్ శుక్లా నా వాడు అంటూ స్వయంగా ఆమె రియాలిటీ షోలోనే పేర్కొంది.
ఈ సంగతి పక్కన పెడితే.. షోలో పాల్గొనే సమయంలో... చాలా బొద్దుగా, ముద్దుగా ఉన్న షెహనాజ్.. ఆ తర్వాత నాజుకుగా మారింది. ఎంతలా అంటే.. ఆమెను చూస్తే.. కనీసం చూపు తిప్పుకోలేనంత అందంగా మారింది.
సన్నగా మారిన తర్వాత.. ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తూనే ఉంది. కాగా... లాక్ డౌన్ సమయంలో ఆమె అంత బరువు ఎలా తగ్గిందో.. ఇటీవల రివీల్ చేసింది.
కాగా షెహనాజ్ కేవలం 6 నెలల వ్యవధిలో 12 కేజీల బరువు తగ్గడం గమనార్హం. ఇటీవల శిల్పాశెట్టితో కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమంలో.. ఆమె తాను బరువు తగ్గేందుకు తీసుకున్న సీక్రెట్ డ్రింక్ గురించి చెప్పింది.
షెహనాజ్ ప్రతి ఉదయం ఓ డ్రింక్ తాగేదట. ఆ డ్రింక్ కారణంగానే బరువు సులభంగా తగ్గిందట. ఆ డ్రింక్ మరేదే కాదు.. పసుపు నీరు. మీరు చదివింది నిజమే.. ఉదయాన్నే పరగడుపున నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని తాగేదట. ఇటీవల దాంట్లో.. యాపిల్ సైడర్ వెనిగర్ కూడా కలపడం మొదలుపెట్టిందట.
ఈ హల్దీ వాటర్ తాగడం వల్ల మన శరీరంలో డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది. దీని కారణంగా.. సులభంగా శరీరంలో కొవ్వు కూడా తగ్గుతుందట. దాని వల్ల మన మెటబాలిజం మెరుగుపడటంతో పాటు.. సులభంగా బరువు తగ్గగలుగుతామట.
ఇక షెహనాజ్ తన బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే.. దోశ, మేతీ పరోటా, మూంగ్ దాల్ చిల్లా తీసుకునేదట. అయితే.. వాటిని కూడా చాలా లిమిటెడ్ గా తీసుకునేదట.
ఇక తన డిన్నర్, లంచ్ చాలా లైట్ గా ఉండేలా చూసుకునేదట. ప్రతిరోజూ రెండు చపాతీలు, ఒక బౌల్ పప్పు మాత్రమే తీసుకునేదట. కూర ఎక్కువ, చపాతీ తక్కువ తీసుకునేదట.
కేవలం ఈ ఫుడ్ తీసుకోవడం మాత్రమే కాకుండా.. వ్యాయామం పరంగా కూడా ఎక్కువ దృష్టి పెట్టేదట. అందుకే.. ప్రతిరోజూ లాక్ డౌన్ సమయంలోనూ వాకింగ్ మాత్రం ఎప్పుడూ ఆపలేదట. దాని వల్లే తాను సులభంగా బరువు తగ్గగలిగానని ఆమె చెప్పడం గమనార్హం.
ఇతర ఆహారాలు తినాలనే కోరికను కూడా కంట్రోల్ చేసుకునేదట. తన వెయిట్ లాస్ జర్నీలో బయట ఆహారం తినడాన్ని ఆమె పూర్తిగా మానేసిందట.