- Home
- Life
- Woman
- Beauty Tips: బియ్యం పిండిలో ఇదొక్కటి కలిపి ముఖానికి రాస్తే.. కొరియన్ బ్యూటీలా మెరిసిపోవచ్చు..!
Beauty Tips: బియ్యం పిండిలో ఇదొక్కటి కలిపి ముఖానికి రాస్తే.. కొరియన్ బ్యూటీలా మెరిసిపోవచ్చు..!
మనకు ఇంట్లో బియ్యం పిండి చాలా సులభంగా దొరుకుతుంది. ఈ బియ్యం పిండితోనే అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అయితే.. దీనితోపాటు.. అవిసెగింజలను కూడా కలిపితే సరిపోతుంది.

Beauty tips
అందంగా కనిపించాలనే కోరిక లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? వయసుతో సంబంధం లేకుండా.. అందంగా మెరిసిపోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దాని కోసమే వేల రూపాయలు ఖర్చు చేసి మరీ.. బ్యూటీ పార్లర్ లకు వెళ్లి.. ఫేషియల్స్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు. ఇక కొందరు..కొరియన్ బ్యూటీలా మెరిసిపోవాలని.. మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు ముఖానికి పూసేస్తూ ఉంటారు. అయితే... కేవలం మన ఇంట్లో దొరికే రెండు ఉత్పత్తులను ముఖానికి రాసినా కూడా చాలా అందంగా మెరిసిపోవచ్చు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
బియ్యం పిండితో మెరిసే అందం..
మనకు ఇంట్లో బియ్యం పిండి చాలా సులభంగా దొరుకుతుంది. ఈ బియ్యం పిండితోనే అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అయితే.. దీనితోపాటు.. అవిసెగింజలను కూడా కలిపితే సరిపోతుంది. ముందుగా.. ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలను తీసుకొని.. మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. దీనిలో ఒక టేబుల స్పూన్ బియ్యం పిండి కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఈ రెండింటి మిశ్రమాన్ని.. నీటితో కలిపి మరిగించాలి. ఒక గ్లాసు నీరు పోస్తే.. అది అరగ్లాసు అయ్యేంత వరకు మరిగించాలి. ఆ నీరు చల్లారిన తర్వాత.. ముఖానికి అప్లై చేయాలి. గంట పాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. వారానికి ఒకసారి దీనిని ముఖానికి రాసినా.. మీ ఫేస్ కొరియన్స్ లా మెరిసిపోవడం పక్కా.
ఈ ఫేస్ ప్యాక్ తో ప్రయోజనాలు...
పై పద్ధతులను ఉపయోగించి మీరు మీ ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసినప్పుడు, ఇది అదనపు నూనె , మలినాలను తొలగించడానికి, నిస్తేజమైన చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి , ముఖాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. నల్ల మచ్చలు , మొటిమలు ఉన్న మహిళలు కనీసం వారానికి ఒకసారి ఈ స్క్రబ్‌ను ఉపయోగించాలి. ఇది ఖచ్చితంగా చర్మాన్ని ఎల్లప్పుడూ మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది.
అవిసె గింజలతో మెరిసే చర్మం..
అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు , యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచడానికి, ముఖం పై ముడతలను తగ్గించడానికి సహాయపడతాయి. అదేవిధంగా, బియ్యం పిండిలో ఉన్న ఫెరులిక్ ఆమ్లం , అల్లంటోయిన్ లక్షణాలు చర్మాన్ని తాజాగా ఉంచడానికి , నల్ల మచ్చలను తొలగించడానికి సహాయపడతాయి.