Face Glow: ఈ రెండూ కలిపి మసాజ్ చేస్తే.... నిమిషాల్లో ముఖంలో గ్లో రావడం పక్కా..!
Face Glow: మీ ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవడానికి ఖరీదైన ఉత్పత్తుల కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఇంట్లో సులభంగా ఉత్పత్తులను వాడినా కూడా ముఖాన్ని మెరిచేలా చేసుకోవచ్చు.

Face Glow
వయసు పెరుగుతుంటే ముఖంలో అందం తగ్గడం సహజం. ముఖంపై ముడతలు, ఫైన్ లైన్స్, నల్ల మచ్చలు రావడం మొదలౌతాయి. వాటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు అన్నింటినీ పూసేస్తూ ఉంటారు. కానీ ఆ క్రీముల వల్ల అందం పెరుగుతుందనే గ్యారెంటీ లేదు. వాటిలో ఉండే కెమికల్స్ మీ స్కిన్ ని మరింత ఎక్కువ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అయితే... మనకు సహజంగా లభించే కొన్నింటితో కనుక రెగ్యులర్ గా మసాజ్ చేస్తే.... నిమిషాల్లో ముఖంపై గ్లో వచ్చేస్తుంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం...
ఫేస్ లో గ్లో పెంచే మసాజ్...
ముఖంలో గ్లో పెంచుకోవాలి అంటే... రెగ్యులర్ గా మసాజ్ చేయడం చాలా అవసరం. మసాజ్ చేయడం వల్ల ముఖంలో కాంతి పెరగడమే కాదు, ఫేస్ చాలా ఫ్రెష్ గా కూడా కనపడుతుంది. అందుకే.. బ్యూటీ పార్లర్ లో కూడా ఫేషియల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే... అక్కడికి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా... ఇంట్లోనే మసాజ్ చేసుకోవచ్చు.
కొబ్బరి నూనెతో మసాజ్...
ముఖాన్ని మృదువుగా, మెరిసే చర్మాన్ని పొందడానికి, మీరు వారానికి ఒకసారి కొబ్బరి నూనెతో ముఖాన్ని మసాజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ముఖం పొడిబారకుండా, తేమగా ఉంటుంది. అంతేకాదు.. రోజంత ముఖం మెరుస్తూ కనపడుతుంది. దీని కోసం మీరు కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి, గోరు వెచ్చగా ఉన్నప్పుడు ముఖం మీ చేతి వేళ్లతో మసాజ్ చేయాలి. కనీసం 10 నిమిషాల పాటు ఇలా మసాజ్ చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని కాటన్ టవల్ తో తుడవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల ముఖం అందంగా కనపడుతుంది.
కలబంద జెల్....
కలబంద కూడా మన ముఖానికి అందాన్ని తెస్తుంది. తాజా కలబంద జెల్ తీసుకొని ముఖం మొత్తం అప్లై చేయాలి. కనీసం 30 నిమిషాల పాటు... మీ ముఖానికి మసాజ్ చేయాలి. ఆ తర్వాత 10 నిమిషాలు అలానే వదిలేసి, ఆ పై నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. మీ ముఖంలో గ్లో రావడమే కాకుండా... నల్ల మచ్చలు వంటివి కూడా తగ్గిపోతాయి. మీ ముఖం మృదువుగా కనపడుతుంది.
గమనిక..
మీ ముఖంపై ఏవైనా అలెర్జీలు ఉంటే, మసాజ్ చేయకూడదు. ఏదైనా మీ ముఖానికి అప్లై చేయడానికి ముందు ప్యాచ్ టెస్టు చేసుకోవాలి. ఆ తర్వాతే ముఖానికి అప్లై చేయాలి. లేదంటే.. స్కిన్ స్పెషలిస్ట్ ని సంప్రదించవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ముఖానికి మసాజ్ చేసిన తర్వాత.. మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు.