ఈ మాస్క్ తో డార్క్ సర్కిల్స్ కి చెప్పండి గుడ్ బై..!
ఈ బ్యూటీ మాస్క్ లను ఉపయోగిస్తే మాత్రం.. కచ్చితంగా.. ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ఈ మధ్యకాలంలో డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడే అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్లు వాడటం.. ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్స్ చూడటం.. సరిగా నిద్రపోకపోవడం.. ఇలా కారణం ఏదైనా.. కంటి సమస్యలు రావడం కామన్ అయిపోయింది. ఇక అమ్మాయిలకు అయితే.. కంటి కింద నల్లటి వలయాలు వచ్చేస్తున్నాయి. ఇవి రావడం చాలా సులువు. కానీ.. ఒక్కసారి వచ్చిన తర్వాత అవి పోవడం మాత్రం అంత సులువు కాదు.
dark circles
అయితే.. ఈ బ్యూటీ మాస్క్ లను ఉపయోగిస్తే మాత్రం.. కచ్చితంగా.. ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
dark circles
కొబ్బరి మాస్క్.. కంటి కింద వలయాలను తొలగించడానికి కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది.య కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని.. కంటి కింద.. డార్క్ సర్కిల్స్ ఉన్న ప్లేస్ లో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల నల్లటి వలయాలు తొలగిపోయే అవకాశం ఉంది.
dark circles
బాదం మాస్క్.. బాదం నూనె శరీరాన్ని హైడ్రేటర్ గా ఉంచడానికి సహాయం చేస్తుంది. ఇది కంటి చుట్టూ నల్లటి వలయాలను తగ్గించడానికి సహాయం చేస్తుంది. బాదం నూనెలో కొద్దిగా తేనె కలిపి కంటి కింద రాయాలి. ఇలా చేస్తే.. నల్లిటి వలయాలతోపాటు.. కంటి కింది క్యారీ బ్యాగ్ లు కూడా తొలగిపోతాయి.
dark circles
రోజ్ వాటర్ మాస్క్.. కళ్లు అలసిపోయినప్పుడు.. ఈ రోజ్ వాటర్ మాస్క్ వేసుకుంటే హాయిగా అనిపిస్తుంది. రోజ్ వాటర్ లో కాటన్ బాల్స్ ఉంచి.. వాటిని 15 నిమిషాలపాటు కంటి మీద ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల.. కంటి నల్లటి వలయాలు తగ్గి.. కళ్లకు బాగా రిలీఫ్ లభిస్తుంది.
పాలు, బేకింగ్ సోడా మాస్క్.. నాలుగు స్పూన్ల పాలలో.. రెండు స్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని..కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఆ తర్వాత దానిని కంటి కింద రాయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో.. ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
గ్రీన్ టీ బ్యాగులు.. వీటితో.. కూడా కంటి కింద నల్లటి వలయాలను తొలగించడానికి సహాయం చేస్తుంది. వాడేసిన టీ బ్యాగులను ఫ్రిడ్జ్ లో ఉంచి.. 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత.. వాటిని కంటి మీద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటి కింద స్వెల్లింగ్ తగ్గి.. నల్లటి వలయాలు తగ్గడానికి సహాయం చేస్తుంది.
కీరదోస.. కీరదోస తో కంటిని రిలాక్స్ చేయవచ్చు. గుండ్రని ముక్కలుగా కోసిన కీరదోసను కంటి మీద పెట్టి కొద్దిసేపటి తర్వాత తీసేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల కంటికి ఉపశమనం కలుగుతుంది.
dark circles
పైనాపిల్ మాస్క్... పైనాపిల్ జ్యూస్ లో కొద్దిగా పసుపు కలిసి.. ముఖం, కంటి కింద రాయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ కూడా.. నల్లటి వలయాలను తొలగించడానికి సహాయం చేస్తుంది.
pine apple girl