హ్యాండ్ ప్రింటెడ్ చీరలో సమంత.. ధర ఎంతో తెలుసా..?
ఆ తర్వాత కథా పరమైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె.. ఇటీవల విడాకులు ప్రకటించి షాకిచ్చింది.

Samantha
టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్, టాలెంటెడ్ నటీమణుల్లో సమంత ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరిగ్గా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇటీవల దానికి సంబంధించి సమంత ఎమోషనల్ పోస్టు కూడా పెట్టింది. ఆమె.. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. నిజంగానే ఆ సినిమాతో తెలుగు ప్రజలను ఆమె మాయ చేశారు. ఇప్పటికీ ఆమె మాయలో అలానే ఉన్నారని చెప్పొచ్చు.
Samantha
దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే.. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కథా పరమైన సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె.. ఇటీవల విడాకులు ప్రకటించి షాకిచ్చింది.
Samantha
విడాకుల తర్వాత కూడా.. సమంత దూకుడు తగ్గలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటి విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Samantha
ఈ సంగతి పక్కన పెడితే.. సమంత తరచుగా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. అదే విధంగా.. తన ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.
తాజాగా.. సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో.. కుందనపు బొమ్మలా కనపడుతోంది. హాఫ్ వైట్ కలర్ లోని ఓ చీర ధరించి ఆ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. ఆ చీరలో ఆమె చాలా అందంగా కనపడుతోంది.
అయితే.. ఆ చీర ధర ఖరీదు ఇప్పుడు.. హాట్ టాపిక్ గా మారింది. ఆ చీర హ్యాండ్ ప్రింటెడ్ సారీ కావడం గమనార్హం. దానికి తగినట్లు మ్యాచింగ్ జ్యువెలరీ ఆమె ధరించారు. కాగా.. ఆ చీర ధర రూ.1లక్ష 15వేలు కావడం గమనార్హం
చీర ధర విని అభిమానులు సైతం షాకౌతున్నారు. ఇదిలా ఉండగా.. సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో చేయబోతుంది.
samantha
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన దసరా సందర్భంగా తాజాగా విడుదలైంది. కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ డైరెక్షన్‌లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు.
ప్రొడక్షన్ నెం.30 అనే వర్కింగ్ టైటిల్‌తో దసరా సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
samantha
ఈ సినిమాతో పాటు సమంత ‘యశోద’ సినిమాను చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఓ కొత్త చిత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాను హరీష్ నారయణ్, హరి శంకర్ దర్శకత్వం వహించనున్నారు.