Face Glow: కుంకుమ పువ్వును ఇలా ముఖానికి రాస్తే.. నిమిషాల్లో మెరుపు..!
Face Glow: పాలు, కుంకుమ పువ్వు ఈ రెండూ మనకు సులభంగా లభించేవే. ఈ రెండిటిని వాడి చాలా తక్కువ సమయంలోనే ముఖం మెరిసేలా చేసుకోవచ్చు. ఈ రెండూ మీ ముఖంపై మచ్చలను తగ్గించి.. ముఖాన్ని మెరిసేలా చేస్తాయి.

Skin Care
అందం మీద శ్రద్ధ అందరికీ ఉంటుంది. ఆ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా, అమ్మాయిల్లో బ్యూటీ మీద ఇంట్రస్ట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే.. మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేసి రాసేస్తూ ఉంటారు. అయితే... అందరికీ ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం నచ్చదు. అలాంటివారు.. సింపుల్ గా లభించే కొన్ని ఉత్పత్తులు వాడితే.. ముఖంలో మెరుపు పెంచుకోవచ్చు. దానికోసం.. చిటికెడు కుంకుమ పువ్వు ఉంటే చాలు. దానిని ముఖానికి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం....
కుంకుమ పువ్వుతో మెరిసే అందం...
కుంకుమ పువ్వును ప్రాచీన కాలం నుంచి సౌందర్య సాధనంగా వాడుతూ వస్తున్నాం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై పేరుకుపోయిన మలినాలను తొలగించి... సహజంగా మెరుపు తేవడానికి సహాయపడతాయి. కుంకుమ పువ్వు.. ముఖంలో రక్త ప్రసరణ మెరుగుపరిచి, చర్మానికి చాలా తక్కువ సమయంలోనే గ్లో అందిస్తుంది.
కుంకుమ పువ్వుతో టోనర్ ఎలా తయారు చేయాలి..?
కావాల్సినవి..
కుంకుమ పువ్వు కొద్దిగా...
అర కప్పు పచ్చిపాలు
కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్..
తయారు చేసే విధానం....
ఒక గాజు లేదా స్టీల్ కంటైనర్ తీసుకొని, అందులో పచ్చి పాలను పోయాలి. ఇప్పుడు అందులో కుంకుమ పువ్వును వేసి.. బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో టీట్రీ ఆయిల్ 3-4 చుక్కలు వేసి బాగా కలపాలి. దీన్ని ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్ పోసి మీరు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఈ టోనర్ ని మీరు వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.
ఈ టోనర్ ని ఎలా వాడాలి..?
ప్రతి రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకొని, ఈ టోనర్‌ను స్ప్రే బాటిల్ ద్వారా ముఖంపై స్ప్రే చేయాలి. సున్నితంగా చేతులతో మసాజ్ చేయండి. దాదాపు 10–15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగండి. ఆ తర్వాత రోజ్ వాటర్ లేదా మాయిశ్చరైజర్ ఉపయోగించవచ్చు.
ప్రయోజనాలు...
ఈ టోనర్ ని రెగ్యులర్ గా ముఖానికి రాయడం వల్ల.. మీ చర్మం చాలా తక్కువ సమయంలో మెరుస్తూ కనపడుతుంది. అంతేకాదు.. ముఖం మీద ఏవైనా మచ్చలు, మొటిమలు ఉన్నా.. అవి తగ్గిపోతాయి. ఫేస్ మాత్రం ప్రకాశవంతంగా, కాంతివంతంగా మారుతుంది. చర్మంపై పేరుకుపోయిన మురికి, దుమ్ము తొలగించడానికి హెల్ప్ చేస్తుంది. ఇక.. ఈ టోనర్ లో పాలు వాడతాం కాబట్టి... చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. కుంకుమ పువ్వు కాంతిని ఇస్తుంది. ఇక.. టీట్రీ ఆయిల్.. మొటిమల ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఈ టోనర్ ని రోజూ వాడితే... మీ ఫేస్ మేకప్ అవసరం లేకుండా కూడా మెరిసిపోతుంది. రాత్రిపూట రాయడం వల్ల ఫలితాలు మరింత అద్భుతంగా వస్తాయి.