Skin Care: గులాబీ రేకులను ముఖానికి రాస్తే.. అందం పెరుగుతుందా?
ఖరీదైన ఉత్పత్తుల అవసరం లేకుండా.. కేవలం గులాబీ రేకుల సహాయంతో చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

గులాబీ రేకులు ఎంత మృదువుగా ఉంటాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి మృదువైన చర్మం కావాలని కూడా అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు తమ స్కిన్ విషయంలో చాలా కోరికలు ఉంటాయి. స్కిన్ మృదువుగా మార్చుకోవడానికి మార్కెట్లో లభించే ఏవేవో ఉత్పత్తులు వాడేస్తూ ఉంటారు. కానీ, ఖరీదైన ఉత్పత్తుల అవసరం లేకుండా.. కేవలం గులాబీ రేకుల సహాయంతో చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
గులాబీ రేకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, సహజ నూనెలు అధికంగా ఉంటాయి. ఇది చర్మపు రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా... చర్మాన్ని ప్రకాశవంతంగా కూడా మారుస్తుంది. మరి, ఆ గులాబీ రేకులను ముఖానికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
మీరు మీ చర్మాన్ని సహజంగా ప్రకాశవంతం చేయాలనుకుంటే, మీరు గులాబీ రేకులను ఉపయోగించి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.
ఫేస్ ప్యాక్ కి తయారీకి కావాల్సినవి...
కొన్ని తాజా గులాబీ రేకులు
ఒక టేబుల్ స్పూన్ పెరుగు
ఒక టీస్పూన్ తేనె
ముందుగా, తాజా గులాబీ రేకులను రుబ్బుకుని పేస్ట్ లా చేసుకోండి. ఇప్పుడు పెరుగు, తేనె వేసి కలపండి. మీ చర్మం జిడ్డుగా ఉంటే పెరుగుకు బదులుగా శనగపిండిని వాడండి. ఇప్పుడు మీ చర్మాన్ని శుభ్రం చేసి ఈ మాస్క్ ని అప్లై చేయండి.సుమారు 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై నీటితో కడిగేయండి.
గులాబీ రేకుల ఫేస్ స్క్రబ్...
చర్మ రంగును సమానంగా పొందడానికి, చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, గులాబీ రేకులు, చక్కెరను ఉపయోగించి స్క్రబ్ తయారు చేసి ఉపయోగించండి.
కావాల్సినవి...
కొన్ని గులాబీ రేకులు
1 టీస్పూన్ చక్కెర
ఒక టీస్పూన్ కొబ్బరి నూనె
ముందుగా గులాబీ రేకులను చూర్ణం చేయండి. ఇప్పుడు చక్కెర, కొబ్బరి నూనె వేసి కలపండి.ఈ స్క్రబ్ ని మీ చర్మంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. చివరగా, నీటి సహాయంతో చర్మాన్ని శుభ్రం చేయండి.