కూరలో ఏ ఉప్పును వేస్తే మంచిది
సాధారణంగా ప్రతి ఇంట్లో అయోడైజ్డ్ ఉప్పునే వాడుతుంటారు. కానీ కొంతమంది రాతి ఉప్పును వాడుతుంటారు. కానీ ఈ రెండింటిలో ఏ ఉప్పును వాడితే మంచిదో తెలుసా?

రాతి ఉప్పు vs సాధారణ ఉప్పు
ఉప్పును మనం రోజూ వాడుతాం. దీనివల్లే వంటలు టేస్ట్ అవుతాయి. అంతేకాదు ఉప్పు మన శరీరానికి కూడా మేలు చేస్తుంది. ఇందుకోసం మనం సాధారణ ఉప్పు అంటే అయోడైజ్డ్ ఉప్పును వాడుతుంటాం. అయితే కొంతమంది మాత్రం రాతి ఉప్పునే వాడుతుంటారు. అయితే ఈ రెండింటిలో మన ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రాతి ఉప్పు
ఈ రాతి ఉప్పు సముద్రపు ఆవిరి నుండి తయారవుతుంది. ఇది బూడిద, ఎరుపు రంగులో ఉంటుంది. శుద్ధి చేయడం వల్ల ఇది తెల్లగా అవుతుంది. దీనిని వాడటం వల్ల వంటకు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఈ ఉప్పులో మనం రెగ్యులర్ గా వాడే ఉప్పులో కంటే ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. దీనిని కొంచెం వాడినా వంటల రుచి అదిరిపోతుంది.
పొడి ఉప్పు
అయోడైజ్డ్ ఉప్పును ఉప్పు పరిశ్రమలో శుద్ధి చేసిన తర్వాత అయోడిన్ వంటివి కలుపుతారు. అయితే ఈ ఉప్పు వల్ల కొంతమందికి అలెర్జీ కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఉప్పును ఎక్కువగా వాడితే కాల్షియం లోపం, గుండె జబ్బులు, బీపీ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఏది మంచిది?
మనం వాడే అయోడిన్ ఉప్పుతో పోలిస్తే రాతి ఉప్పే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది మాత్రం పొడి ఉప్పునే వాడుతుంటారు. ఏదైనా లిమిట్ లో తీసుకుంటే మంచిది. అతిగా తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది.