Grey Hair: చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలా? ఈ నూనె రాస్తే చాలు..!
Grey Hair : మనకు ఆయుర్వేదంలో చాలా మూలికలు ఉన్నాయి. వాటిలో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవే మూలికలతో అనేక ఆరోగ్య సమస్యలతో పాటు మన అందాన్ని కూడా పెంచుకోవచ్చు. తెల్ల జుట్టును నల్లగా కూడా మార్చుకోవచ్చు.

Grey Hair
ప్రస్తుత కాలం లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పిల్లల్లోనూ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీని కారణంగా... చాలా మంది వయసు మళ్లిన వారిలా కనపడుతున్నాం అని ఫీలౌతుంటారు. లేదంటే.... మార్కెట్లో దొరికే ఏవేవో హెయిర్ డైలు వాడేస్తూ ఉంటారు. వాటి వల్ల జుట్టు మరింత ఎక్కువగా డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా.. సహజంగా ఒక నూనె జుట్టుకు రాస్తే.. తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మార్చుకోవచ్చు. మరి, ఆ నూనె ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం....
తెల్ల జుట్టును నల్లగా మార్చే నూనె...
పసుపు... పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మెలనిన్ ని ఉత్పత్తి చేస్తాయి. ఈ మెలనిన్ పుష్కలంగా ఉత్పత్తి అయితే.. జుట్టు రాలే సమస్య ఉండదు. తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా మారతాయి.
ఉసిరికాయ... ఉసిరికాయ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల జుట్టు సమస్యను నివారిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి, నల్లగా నిగనిగలాడటానికి హెల్ప్ చేస్తుంది.
మందారపూలు, ఆకులు.... మందార పూలు, ఆకులు జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి. వీటిని వాడటం వల్ల జుట్టు రాలడం తొందరగా ఆగిపోతుంది. జుట్టు కుదుళ్లను కూడా బలపరుస్తుంది.
కొబ్బరినూనె... రెగ్యులర్ గా కొబ్బరి నూనె వాడటం వల్ల జుట్టుకు అవసరం అయిన తేమ అందుతుంది. అందంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.
మెంతులు... మెంతులు కూడా జుట్టు అందంగా మార్చడంలో , హెయిర్ లాస్ ని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి.
నల్ల జీలకర్ర... ఈ నల్ల జీలకర్రను వాడి కూడా తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టొచ్చు. జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది.
నూనె తయారు చేసే విధానం...
మందార ఆకులు, ఉసిరికాయ ముక్కలు, మెంతులు, నల్ల జీలకర్రను మిక్సర్ లో వేసి నీరు కలపకుండా.. మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఒక పెద్ద ప్యాన్ లో కొబ్బరి నూనె పోసి.. మీడియం సైజు మంట మీద వేడి చేయాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న పేస్టును కూడా అదే నూనెలో వేసి.. ఇంకాసేపు మరిగించాలి. ఆ మిశ్రమం.. గోధుమ లేదా నలుపు రంగులోకి మారే వరకు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి , నూనె చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత.. ఈ మిశ్రమాన్ని ఒక వస్త్రం సహాయంతో వడకట్టాలి. అంతే... మన నూనె రెడీ అయినట్లే...
ఈ నూనె ఉపయోగించే విధానం...
మీరు తయారు చేసుకున్న నూనెను వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయాలి. తల మొత్తానికి నూనె రాసి.. మంచిగా మసాజ్ చేయాలి. తెల్ల జుట్టు ఉన్న ప్లేసులో నూనె మరింత ఎక్కువగా రాసి... మసాజ్ చేయాలి. అలా నూనె రాసిన తర్వాత రాత్రంతా అలానే వదిలేయాలి. మరుసటి రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది. రసాయనాలు లేని షాంపూలు ఎంచుకోవడం ఉత్తమం.
ఈ నూనెను కనీసం వారినికి రెండు లేదా మూడు సార్లు రాసి, రెండు, మూడు నెలలు రెగ్యులర్ గా వాడితే... మీరు అద్భుతమైన ఫలితాలను చూడగలరు. తెల్ల వెంట్రుకలు నెమ్మదిగా నల్లగా మారిపోతాయి.