MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • అన్నాన్ని ఇలా పెడితే మీ జుట్టు ఎంత పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుందో..

అన్నాన్ని ఇలా పెడితే మీ జుట్టు ఎంత పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుందో..

అన్నం కేవలం తినడానికి మాత్రమే కాదు దీన్ని ఎన్నో విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా దీన్ని జుట్టు పెరగడానికి కూడా ఉపయోగించొచ్చు. ఇది జుట్టును  బలంగా, పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 23 2024, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
hair growth

hair growth

ప్రతిఒక్క అమ్మాయి తన జుట్టు అందంగా, మందంగా, పొడుగ్గా ఉండాలని ఆశపడుతుంది. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా జుట్టు పెరగడానికి రకరకాల నూనెలను, షాంపూలను పెడుతుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


కానీ కెమికల్స్ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా వాడితే జుట్టు దెబ్బతింటుంది. వెంట్రుకలు బాగా రాలుతాయి.  అలాగే జుట్టు కూడా పొడిబారుతుంది. అందుకే జుట్టుకు నేచురల్ పద్దతులను ఫాలో అవ్వడం మంచిదంటారు నిపుణులు. 

నిపుణుల ప్రకారం.. ఉడకబెట్టిన అన్నం జుట్టుకు ఎంతో ప్రయోనకరంగా ఉంటుంది. ఇవి మన జుట్టుకు మంచి పోషణను అందించి ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అన్నాన్ని ఉపయోగించి మన జుట్టును పొడుగ్గా, మందంగా, బలంగా పెరిగేలా చేయొచ్చు. అందుకే అన్నాన్ని మన జుట్టుకు ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

35

జుట్టు పెరగడానికి అన్నాన్ని ఎలా ఉపయోగించాలి?

కావాల్సిన పదార్థాలు:  ఉడికించిన అన్నం ఒక కప్పు, మెంతులు,  బీట్ రూట్ జ్యూస్, ఫ్రెష్  కలబంద జెల్ (1 పెద్ద గిన్నె)

జుట్టుకు అన్నాన్ని పెట్టడం వల్ల కలిపే ప్రయోజనాలు 

ఈ హెయిర్ ప్యాక్ ను జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే వెంట్రుకలు రాలే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు ఇది మీ జుట్టును మెరిసేలా, స్ట్రాంగ్ గా మార్చడానికి కూడా ఎంతో సహాయపడుతుంది.
 

45

జుట్టు పెరగడానికి అన్నాన్ని కోసం ఏం చేయాలి?

మెంతులను ముందు రోజు రాత్రంతా నీళ్లలో నానబెట్టండి. ఈ నానబెట్టిన మెంతులను, ఉడికించిన బియ్యాన్ని కలిపి మెత్తని పేస్ట్ లా చేయండి. ఇందుకోసం మెంతులను నానబెట్టిన నీళ్లను వాడండి. దీంట్లోనే బీట్ రూట్ జ్యూస్, అలోవెరా జెల్ ను కూడా మిక్స్ చేయండి.

ఈ పదార్థాలన్నింటినీ కలిపి ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసి మెహందీ హెయిర్ మాస్క్ లా దీన్ని అప్లై చేయండి. దీన్ని జుట్టుకు అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచండి.

ఆ తర్వాత శుభ్రమైన నీళ్లతో జుట్టును శుభ్రంగా కడగండి. అలాగే మర్చిపోకుండా కండీషనర్ ను సరిగ్గా ఉపయోగించండి. దీన్ని తరచుగా ఉపయోగించడం వల్ల మీ జుట్టుకు మంచి పోషణ అందడంతో పాటుగా పొడుగ్గా కూడా పెరుగుతుంది. 

గమనిక - ఏదేమైనా ఏదైనా రెసిపీని ప్రయత్నించే ముందు ఖచ్చితంగా నిపుణులను సంప్రదించాలి. ముఖ్యంగా ఖచ్చితంగా ఒకసారి ప్యాచ్ టెస్ట్ ను చేయించాలి. 
 

55
hair growth

hair growth

ఉసిరికాయతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు

ఉసిరికాయ మన జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని హెయిర్ ఆయిల్ లో కూడా ఉపయోగించొచ్చు. ఈ హెయిర్ ఆయిల్ జుట్టు మూలాలను బలంగా చేస్తుంది.

ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. ఇది జుట్టు తెల్లబడటాన్ని, జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే హెయిర్ ఫోలికల్స్ ను బలంగా చేస్తుంది. నెత్తిమీద రక్తప్రసరణను పెంచి జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. 

జుట్టు ఆరోగ్యం కోసం మీరు ఉదయం పరిగడుపున ఉసిరికాయను తేనెతో కలిపి తీసుకోవచ్చు. అలాగే ఉసిరికాయను నీళ్లు కలపకుండా జ్యూస్ చేసుకుని పరిగడుపున తాగొచ్చు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మీ జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toe Rings: పాదాల అందాన్ని పెంచే ఫ్యాన్సీ వెండి మెట్టెలు..ఓ లుక్కేయండి
Recommended image2
Birth Control: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడితే ఏమవుతుంది?
Recommended image3
Silver Plated Bangles: వెండిలా మెరిసే గాజులు..ధర కూడా తక్కువే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved