MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • ఎర్ర ఉల్లిపాయతో నిజంగా జుట్టు పొడుగ్గా పెరుగుతుందా?

ఎర్ర ఉల్లిపాయతో నిజంగా జుట్టు పొడుగ్గా పెరుగుతుందా?

ఎంతో మంది జుట్టు రాలే, జుట్టు ఊడిపోయే సమస్యలతో బాధపడుతున్నారు. అయితే రెడ్ ఉల్లిపాయలతో ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. రెడ్ ఉల్లపాయతో  జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 11 2024, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
onion

onion

మనం రెగ్యులర్ గా తెల్ల, ఉల్లిపాయలను వంటల్లో తింటుంటాం. ఉల్లిపాయల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అయితే ఎర్ర ఉల్లిపాయలు మన జుట్టుకు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు ఊడిపోకుండా చేసేందుకు, పొడుగ్గా పెరిగేందుకు, చుండ్రును పోగొట్టేందుకు రెడ్ ఉల్లిపాయలు ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఎర్ర ఉల్లిపాయల్లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, సల్ఫర్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. అసలు ఎర్ర ఉల్లిపాయల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జుట్టు పెరుగుదల బలోపేతం 

వెంట్రుకలను తయారుచేసే ప్రోటీన్ అయిన కెరాటిన్ లో సల్ఫర్ ఒక ముఖ్యమైన భాగం. ఎర్ర ఉల్లిపాయలలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలను, ఖనిజాలను అందించడానికి సహాయపడుతుంది. ఎర్ర ఉల్లిపాయలతో జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. 
 

36

జుట్టు రాలడాన్ని నివారిస్తుంది

ఎర్ర ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అలాగే జుట్టు తెగిపోయే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఎర్ర ఉల్లిపాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే జుట్టు కుదుళ్లు దెబ్బతినకుండా ఉండటానికి సహాయపడతాయి. 
 

46
hair care

hair care

చుండ్రు దూరం 

చుండ్రు వల్ల వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతాయి. అలాగే నెత్తిమీద దురద కూడా పెడుతుంది. అయితే ఎర్ర ఉల్లిపాయల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి దురదను తగ్గిస్తాయి. అలాగే  ఎర్ర ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియా, శిలీంధ్రాలను నాశనం చేస్తాయి. ఇవి మీ నెత్తిని శుభ్రంగా ఉంచుతాయి. 
 

56

జుట్టుకు పోషణ

సల్ఫర్ తో పాటుగా ఉల్లిపాయల్లో విటమిన్ సి, విటమిన్ బి6 లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పొడుగ్గా పెరిగేందుకు సహాయపడతాయి. దీనిలో ఉండే ఈ విటమిన్లు జుట్టు కుదుళ్లను పోషించడానికి, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. 
 

66
hair growth

hair growth

ఎర్ర ఉల్లిపాయలను ఎలా ఉపయోగించాలి?

జుట్టు సంరక్షణలో భాగంగా ఎర్ర ఉల్లిపాయలను ఉపయోగించాలనుకుంటే మీరు ఒకటి నుంచి రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేయండి. దీన్ని జ్యూసర్ లేదా బ్లెండర్ ఉపయోగించి రసం తీయండి. ఈ రసాన్ని జుట్టుకు అప్లై చేయండి.  ఈ రసం నెత్తిమీది నుంచి చివర్ల వరకు మొత్తం పెట్టి బాగా మసాజ్ చేయండి.  మీరు ఎర్ర ఉల్లిపాయలను క్రమం తప్పకుండా ఉపయోగించొచ్చు. అలాగే వారానికి ఒకసారి వాటిని మీ జుట్టు సంరక్షణ దినచర్యలో చేర్చొచ్చు.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved