వీళ్లు కలబందను ముఖానికి అస్సలు పెట్టకూడదు
కలబంద మన ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది కలబందను ముఖానికి వాడుతుంటారు. కానీ కొంతమంది మాత్రం ముఖానికి కలబందను అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే?
కలబంద అనారోగ్య సమస్యలనే కాదు.. చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కలబంద జెల్ ను ఉపయోగించి మనం మొటిమలు, మచ్చలతో పాటుగా ఎన్నో చర్మ సమస్యలను సులువుగా తగ్గించుకోవచ్చు. కానీ ఈ జెల్ ప్రతి ఒక్కరి చర్మానికి ప్రయోజనకరంగా ఉండదు. అవును కొంతమంది ముఖానికి కలబందను వాడకూడదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అలెర్జీ
అలెర్జీ ఉన్నవారు కలబంద జెల్ ను వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. అది కూడా కలబందకు. అంటే మీరు కలబంద జెల్ ను ఉపయోగించిన తర్వాత ఏదైనా అలెర్జీ అనిపిస్తే వెంటనే మీరు కలబందను వాడటం మానేయండి.
సిస్టిక్ మొటిమలు
సిస్టిక్ మొటిమలు ఉన్నవారు కూడా కలబంద జెల్ ను వాడకూడదంటున్నారు నిపుణులు. సిస్టిక్ మొటిమలు అంటే.. మొటిమలు పెద్ద సైజులో ఉండి.. విపరీతంగా నొప్పి పెడతాయి. ఇలాంటి మొటిమల సమస్యతో బాధపడుతున్నవారు కలబంద జెల్ ను ఉపయోగించకూడదు. ఎందుకంటే కలబంద జెల్ ను ఎక్కువగా ఉపయోగిస్తే ఈ మొటిమలు మరింత ఎక్కువ అవుతాయి.
సన్ స్క్రీన్
మీరు ఎండలో బయటకు వెళ్తున్నట్టైతే.. కలబంద జెల్ వాడితే ఖచ్చితంగా సన్ స్క్రీన్ ను వాడండి. లేదంటే మీరు హైపర్పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడే అవకాశం ఉంది.
గాయాలు
అవున.. ముఖంపై గాయాలు ఉన్నవారు కూడా ముఖానికి కలబంద జెల్ ను వాడకూడదు. కలబంద జెల్ లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గాయాలను మాన్పడానికి సహాయపడినా.. ముఖంపై గాయాలు అయితే మాత్రం వాడకూడదు. ఎందుకంటే ఇది ముఖంపై ఉన్న గాయాలను మరింత పెంచుతుంది.
సున్నితమైన చర్మం
సున్నితమైన చర్మం ఉన్నవారు కూడా కలబంద గుజ్జును ముఖానికి పెట్టకూడదు. ఎందుకంటే కలబంద జెల్ ను ముఖానికి అప్లై చేస్తే చర్మపు చికాకు, ఎరుపు వంటి చర్మ సమస్యలు వస్తాయి.