Hair care: జుట్టు విపరీతంగా రాలిపోతోందా..? కారణం ఇదే కావచ్చు..!
అలా మీ జుట్టు రాలిపోవడానికీ.. జుట్టు పలచగా మారడానికి చాలా కారణాలే ఉన్నాయట. జుట్టు ఎక్కువగా రాలడానికి కారణాలేంటో నిపుణులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం...
మేము జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాం.. అయినప్పటికీ.. మా జుట్టు విపరీతంగా రాలిపోతుంది అని బాధపడేవారు ఈ మధ్యకాలంలో చాలా మందే ఉన్నారు. అయితే.. అలా మీ జుట్టు రాలిపోవడానికీ.. జుట్టు పలచగా మారడానికి చాలా కారణాలే ఉన్నాయట. జుట్టు ఎక్కువగా రాలడానికి కారణాలేంటో నిపుణులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం...
జుట్టు పల్చబడటానికి 5 ప్రధాన కారణాలను చూద్దాం...
1. ఒత్తిడి - మనం ఎక్కువగా ఆలోచించినప్పుడు, బాధలో ఉన్నప్పుడు మన మొత్తం నాడీ వ్యవస్థ & జీర్ణవ్యవస్థ ఒత్తిడికి లోనవుతుంది. ఇది లోపల అసమతుల్యతకు దారితీస్తుంది. ఈ అసమతుల్యత కారణంగా.. కూడా జుట్టు విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది.
2. ఆహారం - బయోటిన్, జింక్, విటమిన్ డి ఆహారం లోపం జుట్టు పల్చబడటానికి దారితీస్తుంది, నిజానికి విటమిన్ డి లేకపోవడం అలోపేసియాకు దారితీస్తుంది. కాబట్టి, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం వల్ల .. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
hair fall
3. చుండ్రు - మన జుట్టు విపరీతంగా ఊడిపోవడానికి మరో కారణం చుండ్రు. చుండ్రు కారణంగా.. తలలో దురద ఎక్కువగా వస్తుందట. దీని వల్ల... జుట్టు బలహీనంగా మారుతుంది. దీని వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలుతుంది.
hair fall
4. బరువు తగ్గడం - బరువులో గణనీయమైన తగ్గుదల కూడా జుట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బరువు తగ్గుతున్నప్పుడు మనం కొన్ని ముఖ్యమైన పోషకాలను కూడా కోల్పోతాము. అది జుట్టు రాలడానికి కారణమౌతుంది.
hair fall
5. వయస్సు - అది మగ లేదా ఆడ కావచ్చు, వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి . దీని వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలుతుంది.