MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Woman
  • కనుబొమ్మల వెంట్రుకలు ఎందుకు రాలిపోతాయి?

కనుబొమ్మల వెంట్రుకలు ఎందుకు రాలిపోతాయి?

నెత్తిమీద వెంట్రుకలే కాదు కనబొమ్మల వెంట్రుకలు కూడా రాలిపోతుంటాయి చాలా మందికి. అసలు కనుబొమ్మల వెంట్రుకలు ఎందుకు రాలిపోతాయో తెలుసా?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 05 2024, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మనం ముఖ సౌందర్యాన్నికాపాడుకోవడంలో కనుబొమ్మ వెంట్రుకలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కొంతమందికి కనుబొమ్మలు ఒత్తుగా ఉంటే.. మరికొంతమందికి పల్చగా ఉంటాయి. అయితే చాలా మందికి కనుబొమ్మల వెంట్రుకలు బాగా రాలిపోతుంటాయి. కనుబొమ్మల వెంట్రుకలు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేంటి? అవి రాలకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పోషకాహార లోపం

మన శరీరానికి పోషకాలు చాలా చాలా అవసరం. పోషకాలు శరీరంలో బాగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా, బలంగా, ఎనర్జిటిక్ గా ఉంటాం. అయితే ఈ పోషకాలు లోపిస్తే ఆరోగ్యం దెబ్బతినడంతో పాటుగా కనుబొమ్మల వెంట్రుకలు కూడా రాలిపోతాయి. అందుకే మీరోజువారి ఆహారంలో ఐరన్, జింక్, విటమిన్ బి 12, విటమిన్ డి వంటి పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే  ఆహారాలను చేర్చుకోండి. 
 

37

హార్మోన్ల మార్పులు 

ఆడవారి శరీరంలో హార్మోన్ల మార్పులు రావడం చాలా కామన్. దీనివల్ల మూడ్ స్వింగ్స్ తో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ హార్మోన్ల మార్పుల వల్ల కూడా కనుబొమ్మల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

47

ఒత్తిడి

ప్రస్తుత కాలంలో ఒత్తిడి లేని వారు అసలే ఉండరేమో. కానీ విపరీతమైన ఒత్తిడి, యాంగ్జైటీ మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. వీటివల్ల కనుబొమ్మల వెంట్రుకలు కూడా విపరీతంగా రాలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి.
 

57

ఆలివ్ ఆయిల్ 

ఆలివ్ ఆయిల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించి కనుబొమ్మలు రాలకుండా చేయొచ్చు. ఇందుకోసం.. మీరు నూనెను వేళ్లకు అంటించుకుని కనుబొమ్మలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా రోజూ చేస్తుంటే కనుబొమ్మల వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.
 

67

కొబ్బరి పాలు

కొబ్బరి పాలతో కూడా మీరు కనుబొమ్మల వెంట్రుకలు రాలకుండా చేయొచ్చు. ఇందుకోసం మీరు కాటన్ బాల్ ను తీసుకుని కొబ్బరి పాలలో ముంచండి. వీటిని మీ కనుబొమ్మలపై పెట్టండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కనుబొమ్మలపై వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. 
 

77

ఆముదం నూనె

ఆముదం నూనె జుట్టుకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. మీరు కనుబొమ్మల వెంట్రుకలు రాలకుండా ఉండాలంటే.. రాత్రి పడుకునే ముందు కనుబొమ్మలకు ఆముదం నూనెను అప్లై చేయండి. ఇది కనుబొమ్మలపై జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved