అంబానీ కోడలు రాధిక మర్చంట్ బ్యాగ్రౌండ్ తెలుసా?
రాధిక మర్చంట్ కి వెనక ఆస్తులు లేవని, అందుకే అనంత్ అంబానీని పెళ్లి చేసుకుంటోంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. కానీ.. రాధిక ఫ్యామిలీ కూడా ఏం తక్కువ కాదు. ఆమె తండ్రి విరెన్ మర్చంట్.. మన దేశంలో టాప్ బిలినియర్లలో ఒకరు.
అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనంత్ అంబానీ ఆయన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్ ని పెళ్లాడబోతున్నారు. ఇక.. అనంత్ బ్యాగ్రౌండ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. ఎవరు ఈ రాధిక మర్చంట్..? ఆమె ఏం చుదువుకుంది..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..? ఆమె పేరెంట్స్ ఏం చేం చేస్తారో తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..!
ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈవో విరెన్ మర్చంట్, ప్రముఖ ఎంట్రప్యూనర్ శైలా మర్చంట్ ల చిన్న కుమార్తె రాధిక మర్చంట్. అందరూ.. రాధిక మర్చంట్ కి వెనక ఆస్తులు లేవని, అందుకే అనంత్ అంబానీని పెళ్లి చేసుకుంటోంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. కానీ.. రాధిక ఫ్యామిలీ కూడా ఏం తక్కువ కాదు. ఆమె తండ్రి విరెన్ మర్చంట్.. మన దేశంలో టాప్ బిలినియర్లలో ఒకరు.
రాధిక తన స్కూలింగ్ మొత్తం ముంబయిలో పూర్తి చేశారు. సోమని ఇంటర్నేషనల్ స్కూల్ లో కూడా చదివారు.. ముంబయిలో స్కూలింగ్ నుంచే ఆమె, అనంత్ అంబానీ ఫ్రెండ్స్ కావడం విశేషం.రాధిక తన గ్రాడ్యుయేషన్ యోర్క్ యూనివర్శిటీలో చేశారు. పాలిటిక్స్, ఎకనామిక్స్ లో ఆమె గ్యాడ్యుయేషన్ పూర్తి చేశారు.
కేవలం మంచి చదువు మాత్రమే కాదు.. కర్కులర్ యాక్టివిటీస్ లోనూ రాధిక చాలా చురుకుగా ఉంటారు. తన కాబోయే అత్తగారు నీతా అంబానీ లాగానే రాధిక కూడా మంచి డ్యాన్సర్. దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఆమె భరతనాట్యంలో శిక్షణ పొందారు. శ్రీ నిభా ఆర్ట్స్ డ్యాన్స్ అకాడమీలో ఆమె భరతనాట్యం శిక్షణ పొందారు.
తన చదువు పూర్తి చేసిన తర్వాత.. తండ్రి వ్యాపారంలో రాధిక చేరారు. తండ్రికి చెందిన ఎన్కోర్ హెల్త్ కేర్ కంపెనీలో ఆమె కూడా ఒక బోర్డ్ మెంబర్ కావడం విశేషం.
అంతేకాదు.. రాధిక మర్చంట్ జంతు ప్రేమికురాలు. యానిమల్ వెల్ ఫేర్ లో ఆమె చాలా చురుకుగా వ్యవహరిస్తారు. ఇక, వీరి వివాహం విషయానికి వస్తే.. మార్చి 1-3 తేదీల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుక జరగనుంది.
ఈ వేడుకకు దేశ, విదేశాల నుండి సుమారు 1000 మంది వ్యాపార ప్రముఖులు ఈ వేడుకకు రానున్నారు. బిల్ గేట్స్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు అనంత్-రాధికలను ఆశీర్వదించనున్నారు.
ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం ఇండోర్ నుండి సుమారు 25 మంది చెఫ్‌లతో కూడిన ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేశారు.ఈ ఈవెంట్ లో ఇండియన్ పుడ్ తో పాటు ఏషియన్ కాంటినెంటల్, మెడిటేరియన్, పార్సీ, థాయ్, మెక్సికన్, జపనీస్ ఫుడ్స్‌ను సిద్ధం చేస్తారట. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో దాదాపు 2500 రకాల వంటకాలను అతిథులకు అందించనున్నారు. ఇందులో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం, ఇతర స్నాక్స్ ఉంటాయి.