రాత్రికి రాత్రే మెరిసిపోవాలా.. ఇవిగో బ్యూటిఫుల్ ట్రిక్..!
చర్మ సౌందర్యం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలంటే వర్కింగ్ ఉమెన్స్ కి ఇబ్బందే. అలా అని స్కిన్ కేర్ ని పూర్తిగా పట్టించుకోకపోతే అందమైన చర్మం కాస్త.. అందవికారంగా మారిపోతుంది. అయితే.. ఫేషియల్స్ తో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అందంగా ఉండటం ఆడవారి హక్కు. ఆ అందం రోజు రోజుకీ మెరుగుపరుచుకోవాలని ప్రతి అమ్మాయి, మహిళ ఆశపడతారు. అందుకోసం వేలకు వేలు ఖర్చుపెట్టేవారు లేకపోలేదు. అయితే.. సింపుల్ గా ఇంట్లోనే ఖర్చు లేకుండా.. రాత్రి వేళ చేసే ఈ ఫేస్ ప్యాక్ లతో ఉదయాన్నే మెరిసిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
చర్మ సౌందర్యం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలంటే వర్కింగ్ ఉమెన్స్ కి ఇబ్బందే. అలా అని స్కిన్ కేర్ ని పూర్తిగా పట్టించుకోకపోతే అందమైన చర్మం కాస్త.. అందవికారంగా మారిపోతుంది. అయితే.. ఫేషియల్స్ తో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఉదయమంతా పనిలో బిజీగా ఉండేవారికి ఆ సమయంలో ఫేషియల్స్ చేసుకోవడం చాలా కష్టం. అలాంటి వారు.. రాత్రి పూట దాని కోసం సమయం కేటాయిస్తే సరిపోతుంది. అలా ఫేషియల్ చేసుకొని రాత్రి పూట నిద్రపోతే.. ఉదయం కల్లా.. మెరిసిపోవచ్చు.
1.ఓట్ మీల్, తేనె
రెండు స్పూన్ల తేనెలో ఓట్ మీల్ కలపాలి. దీనిలో కొంచెం రోజ్ వాటర్ కూడా కలపాలి. క్రీమ్ లాగా తయారు చేసుకొని దానిని ముఖానికి రాయాలి. అలానే వదిలేసి.. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో స్క్రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
వోట్ మీల్ అనేది సహజమైన ఎక్స్‌ఫోలియేటర్, ఇది డెడ్ సెల్స్ ని తొలగిస్తుంది. అంతేకాకుండా చర్మం ఎప్పుడూ మృదువుగా ఉండేలా సహాయం చేస్తుంది. ఈ బ్యూటీ ఫేస్ మాస్క్ ఆయిల్ స్కిన్ వారికీ.. ముఖ్యంగా ఎక్కువగా పింపుల్స్ సమస్యతో బాధపడేవారికి బాగా పనిచేస్తుంది. ముఖం మెరిసిపోయేలా చేస్తుంది.
పెరుగులో తేన కలిపి.. దానిని రాత్రిపూట ముఖానికి రాసుకోవాలి. తెల్లారి శుభ్రం చేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.
పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది, ఇది డెడ్ స్కిన్ సెల్స్ పై పనిచేస్తుంది. అంతేకాకుండా బ్రేక్అవుట్లను నివారిస్తుంది. తేనె చర్మాన్ని పోషించడానికి సహాయపడుతుంది. చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది.
కీరదోస, ఆలివ్ ఆయిల్.. రెండు స్పూన్ల కీరదోస జ్యూస్ లో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. రాత్రిపూట ఈ మిశ్రమం ముఖానికి రాసి ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
కీరదోసలో కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది స్కిన్ ని స్మూత్ చేయడానికి.. చర్మం పీహెచ్ లెవల్స్ బ్యాలెన్స్ చేయడానికి సహాయం చేస్తుంది. స్కిన్ హైడ్రేట్ చేయడానికి కూడా సహాయం చేస్తుంది.
ఇవి మాత్రమేకాకుండా..తగిన నీరు తీసుకోవడం కూడా చాలా అవసరం. అంతేకాకుండా..సరిపోయేంత నిద్ర కూడా అవసరం. ఇవి ఫాలో అయితేనే చర్మం అందంగా మెరుస్తుంది. వ్యాయామం కూడా చర్మ సౌందర్యానికి సహాయం చేస్తుంది.