కుంకుమను ఏ వేళితో పెట్టుకోవాలో తెలుసా?
హిందూమతంలో కుంకుమను చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే పెళ్లైన ప్రతి స్త్రీ నుదిటిన ఖచ్చితంగా పెట్టుకోవాలంటారు పెద్దాలు. సరైన పద్దతిలో కుంకుమను పెట్టుకుంటే భర్త ఆయుష్షు పెరుగుతుందని జ్యోతిష్యులు చెప్తారు.
హిందూమతంలో పెళ్లైన ఆడవాళ్లు ఖచ్చితంగా నుదిటిన, పాపిట్లో కుంకుమను ఖచ్చితంగా పెట్టుకుంటారు. కుంకుమకు ధార్మిక, జ్యోతిష శాస్త్రాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆడవాళ్లు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం కుంకుమను పెట్టుకుంటారు. అంతేకాదు దీనివల్ల తమ భర్తలకు అదృష్టం వరిస్తుందని కూడా నమ్మకం ఉంది. పదహారు అలంకరణలో కుంకుమను ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. కానీ చాలా మంది ఆడవాళ్లు దీన్ని పెట్టుకునేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. సాధారణంగా కుంకుమను చూపువు వేలు లేదా మధ్యన వేలుతో పెట్టుకుంటుంటారు. కానీ కుంకుమను పెట్టుకోవడానికి కూడా ఒక పద్దతి ఉంది. అలా కాకుండా వేరే పద్దతిలో కుంకుమను పెట్టుకుంటే ఆడవాళ్లు ఎన్నో కష్టాలు పడాల్సి వ
నుదిటిన ఇలా కుంకుమను పెట్టండి
పెళ్లైన ఆడవాలు కుంకుమను పెట్టుకోవడానికి ముందు పార్వతీదేవిని పూజించాలి. అమ్మవారిని అదృష్టాన్ని ప్రసాదించమని కోరుకోవాలి. ఇది మీ భర్త ఆయుష్షును పెంచుతుంది. అలాగే వారికి అదృష్టాన్ని కూడా పెంచుతుంది.
ఈ వేలితో కుంకుమను పెట్టుకోండి
కుంకుమను ఎప్పుడూ కూడా ఉంగర వేలితో అంటే చేతి మూడో వేలితో పెట్టుకోవాలి. ఉంగరం వేలితో కుంకుమను పెట్టుకోవడం వల్ల మీ మానసిక శక్తి బలపడుతుంది. ఇది సూర్యభగవానుడికి సంబంధించింది. ఈ వేలితో కుంకుమను పెట్టుకోవడం వల్ల సంతోషం, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
వారానికోసారి
పెళ్లి తర్వాత భర్తతో ఆడవాళ్లు కుంకుమను పెట్టించుకోవాలి. కానీ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ పెళ్లైన ఆడవారు వారానికి ఒక్కసారైనా తన భర్తతో కుంకుమను నుదిటిన పెట్టించుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది ఆడవాళ్ల అదృష్టాన్ని పెంచుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది.
ఒలికిపోయిన కుంకుమ
కుంకుమను పెట్టుకునేటప్పుడు చేతుల్లోంచి జారి కిందపడిపోవడం సాధారణంగా జరుగుతుంది. ఇలాంటప్పుడు ఆడవాళ్లు కింద ఒలికి కుంకుమను ఒత్తి కుంకమ డబ్బాలో నింపుతారు. దీన్నే పెట్టుకుంటారు. కానీ కిందపడ్ కుంకుమను పెట్టుకోకూడదు. దీన్ని అశుభంగా భావిస్తారు. కింద పడ్డ కుంకుమను పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్షు తగ్గుతుందని కూడా నమ్ముతారు. అందుకే ఇలాంటి పని చేయకండి.