రాత్రి పడుకునే ముందు ఇదొక్కటి పెడితే.. ఉదయానికి మీ ముఖం మెరిసిపోతుంది
మిగతా కాలాల సంగతి పక్కన పెడితే చలికాలంలో మనం ముఖం నీరసంగా, బాగా పొడిబారుతుంది. దీనివల్ల ఎంత అందంగా రెడీ అయినా అలాగే కనిపిస్తాం. అయితే రాత్రిపూట ఒకటి ముఖానికి రాస్తే ఉదయానికల్లా మీ ముఖం అందంగా మెరిసిపోతుంది.

చలికాలంలో మన చర్మాన్ని పొడిగా కనిపించకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. అయినా మన చర్మం మాత్రం డల్ గా, నీరసంగా, పొడిబారినట్టుగా కనిపిస్తూనే ఉంటుంది. ఈ ఒక్క సీజన్ లోనే మన చర్మం ఇలా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సీజన్ లో వీచే చల్లని గాలులు, పొడి వాతావరణం వల్ల చర్మం దెబ్బతింటుంది. దీనివల్ల మన చర్మం జీవం లేనట్టుగా కనిపిస్తుంది. బాగా పొడిబారుతుంది. ఇలా చర్మం కనిపించకుండా ఉండేందుకు చాలా మంది ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. అయినా చర్మం మాత్రం అలాగే కనిపిస్తుంటుంది.
నిజం చెప్పాలంటే మార్కెట్ లో దొరికే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో హానికరమైన కెమికల్స్ ఉంటాయి. వీటివల్ల మన చర్మం డ్యామేజ్ అవుతుంది. అందుకే కొంతమంది ఎలాంటి హాని చేయని ఇంటి చిట్కాలను బాగా వాడుతుంటారు. మీరు కూడా ఈ చలికాలంలో మీ ముఖానికి నేచురుల్ గ్లో కావాలనుకున్నా, మీ చర్మానికి ఫ్రెష్ లుక్ ను ఇవ్వాలనుకున్నా ఈ నైట్ స్కిన్ కేర్ రొటీన్ ను ఫాలో అవ్వండి.
skin care
నైట్ స్కిన్ కేర్ రొటీన్
కావాల్సిన పదార్థాలు
గ్లిజరిన్ - 2 టేబుల్ స్పూన్లు
రోజ్ వాటర్ - 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం - 2 చుక్కలు
బొప్పాయి గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు
skin care
ఎలా తయారుచేయాలి?
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో గ్లిజరిన్, బొప్పాయి గుజ్జు, రోజ్ వాటర్ ను వేసి బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం వేసి మళ్లీ కలపండి. ఈ పేస్ట్ ను ఒక గాజు సీసాలో నింపండి. దీన్ని మీరు ప్రతిరోజూ రాత్రిపూట పడుకునే ముందు చేతులతో ముఖానికి అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. దీన్ని రాత్రంతా ఇలానే ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి.
skin care
ఈ నైట్ స్కిన్ కేర్ రొటీన్ మీరు గనుక రెగ్యులర్ గా వారం రోజుల పాటు ఫాలో అయితే కొన్ని రోజుల్లో తేడాను చూస్తారు. నిజానికి రోజ్ వాటర్, గ్లిజరిన్ మన చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇకపోతే బొప్పాయి మన చర్మం పొడిబారకుండా చేస్తుంది. అలాగే నిమ్మరసం మచ్చలు తగ్గడానికి సహాయపడుతుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇవన్నీ కలిసి చలికాలంలో మన చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి.