MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ధోనీ, సాక్షి ప్రేమ కథ ఎలా మొదలైందో తెలుసా..?

ధోనీ, సాక్షి ప్రేమ కథ ఎలా మొదలైందో తెలుసా..?

ఆ తర్వాత పది సంవత్సరాలకు వారు మళ్లీ కోల్ కతాలోని తాజ్ బెంగాల్ హోటల్ లో కలుసుకున్నారు. అక్కడ ధోనీ స్టే చేయడానికి వెళ్లగా.. సాక్షి అక్కడ ఇంటర్న్ గా చేస్తోంది. ఆ సమయంలో వారికి పరిచయం ఏర్పడింది.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 12 2021, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110


టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ రథ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా.. వివిధ దేశాల్లో ఆయనకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆయన ఆట తీరుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ ఏడాది ఐపీఎల్ లోనూ.. జట్టు గెలిపించేందుకు ధోనీ కృషి చేస్తున్నారు. ఇప్పటికే.. చెన్నై జట్టు.. ఫైనల్స్ కి చేరుకుంది.

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

ఈ సంగతి పక్కన పెడితే.. ధోనీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి కూడా ఆయన అభిమానులు ఆసక్తి  చూపిస్తూ ఉంటారు. మరి ఎంత మందికి ధోనీ ప్రేమ కథ తెలుసు. ధోనీ.. సాక్షిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే విషయం మనకు తెలుసు. కానీ.. అతని ప్రేమ కథ ఎలా మొదలైంది.. పెళ్లి దాకా ఎలా వెళ్లింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామా..

310

చాలా మంది ధోనీ జీవిత కథ ఆధారంగా తీసిని ఎంఎస్ ధోనీ సినిమా చూసి వారి కథ గురించి తెలుసుకునే ఉంటారు. అందరికీ తెలిసిన విషయం వరకు.. ధోనీ, సాక్షిలు మొదటి సారి ఓ హోటల్ లో కలుసుకున్నారని.. అక్కడే వారికి పరిచయం అయ్యిందని.. కానీ నిజానికి వారిద్దరికీ చిన్నప్పటి నుంచి  పరిచయం ఉందట. వారిద్దరి తండ్రులు రాంచిలో ఒకే చోట పనిచేశారు. అలా వారిద్దరికీ పరిచయం ఉంది. కానీ చిన్నతనం కాబట్టి మర్చిపోయి ఉంటారు.

410

ఆ తర్వాత పది సంవత్సరాలకు వారు మళ్లీ కోల్ కతాలోని తాజ్ బెంగాల్ హోటల్ లో కలుసుకున్నారు. అక్కడ ధోనీ స్టే చేయడానికి వెళ్లగా.. సాక్షి అక్కడ ఇంటర్న్ గా చేస్తోంది. ఆ సమయంలో వారికి పరిచయం ఏర్పడింది.

510

అయితే.. అక్కడ సాక్షి.. ధోనీకి మొదటి చూపులోనే నచ్చేసింది. ధోనీని ముందు అడుగు వేసి ఆమె ఫోన్ నెంబర్ అడిగి తీసుకొని.. ఆ తర్వాత ఆమెకు మెసేజ్ చేయడం విశేషం.
 

610

ధోనీ నుంచి మెసేజ్ లు వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ సాక్షి మాత్రం.. ఒక్క మెసేజ్ కి కూడా రిప్లే ఇచ్చేది కాదట. ఈ విషయం వారే స్వయంగా వివరించడం గమనార్హం.
 

710


ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. కాగా.. 2008 నుంచి వీరు డేటింగ్ చేయడం మొదలుపెట్టారట. అయితే.. ఎక్కువగా వారు బయట తిరగడం లాంటివి చేసేవారు కాదట. బయట కలుద్దామని ధోనీ ఎప్పుడూ అడగలేదట.

810

రెండు సంవత్సరాలు డేటింగ్ తర్వాత.. 2010లో ధోనీ, సాక్షిలు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఆ పెళ్లికి వారి కుటుంబసభ్యులు, క్రీడాకారులు, కొందరు రాజకీయ నాయకులు.. సినీ ప్రముఖులు హాజరయ్యారు.

910

అయితే.. సాక్షి.. ధోనీ జీవితంలో మూడో ప్లేస్ ఇస్తాడట. మొదటి ప్లేస్ దేశానికి, రెండో ప్లేస్ తన తల్లిదండ్రులకు ఆ తర్వాత  మూడో ప్లేస్ సాక్షికి ఇస్తాడట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.
 

1010

కాగా.. ఈ దంపతులకు ఇప్పుడు ఓ ముద్దులొలికే కుమార్తె కూడా ఉంది. జివాతో వారి ఫ్యామిలీ కంప్లీట్ అయ్యింది. కాగా.. జీవా ధోనీకి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం విశేషం.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Glowing Skin: ఉదయం 5 నిమిషాలు ఇలా చేస్తే మీ ముఖం పార్లర్ గ్లో లాగా మెరిసిపోతుంది
Recommended image2
Black Thread: అమ్మాయిలు ఏ కాలికి నల్లదారం కట్టుకోవాలి?
Recommended image3
Anklets: డబల్ లేయర్ పట్టీలతో రెట్టింపు అందం..తక్కువ బరువుతో హెవీ లుక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved