MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • హెన్నా కాదు.. తలకు ఈ ఆకుల పొడి వాడండి.. జుట్టు నల్లగా మారడం ఖాయం..!

హెన్నా కాదు.. తలకు ఈ ఆకుల పొడి వాడండి.. జుట్టు నల్లగా మారడం ఖాయం..!

హెన్నా వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుందో లేదో తెలీదు కానీ.. ఈ ఆకుల పొడి మాత్రం తలకు రాస్తే.. మీ జుట్టు నల్లగా మారుతుంది. ఊడటం తగ్గుతుంది. ఇతర ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. మరి ఆ ఆకులేంటో ఓసారి చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 14 2024, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రోజుల్లో 30, 35ఏళ్లు రాకముందే జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు తెల్లపడటం లాంటి సమస్యలు  వస్తున్నాయి. దీంతో...ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా మంది ఏవేవో  ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది జుట్టు కాస్త తెల్లపడగానే హెన్నా రాయడం మొదలుపెడతారు.దాని వల్ల జుట్టు బలంగా మారుతుందని,  తెల్ల జుట్టు కూడా ఎర్రగా మారతుంది. తెల్లగా కనపడదు కదా అనుకుంటూ ఉంటాం.  కానీ... హెన్నా వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుందో లేదో తెలీదు కానీ.. ఈ ఆకుల పొడి మాత్రం తలకు రాస్తే.. మీ జుట్టు నల్లగా మారుతుంది. ఊడటం తగ్గుతుంది. ఇతర ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. మరి ఆ ఆకులేంటో ఓసారి చూద్దాం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

మనలో అందరికీ మునగాయ తెలిసే ఉంటుంది. అయితే.. ఈ మునగకాయమాత్రమే కాదు.. మునగ ఆకు కూడా  మనకు చాలా ప్రయోజనాలు అందిస్తుంది. మునగ ఆకును చాలా మంది పప్పులో వేసుకోవడం ద్వారా ఆహారంలో భాగం చేసుకుంటారు. కేవలం తినడానికి మాత్రమే కాదు.. మన హెయిర్ కేర్ రొటీన్ లోనూ దీనిని భాగం చేసుకోవచ్చు. అప్పుడు మనం ఎన్నో రకాల సమస్యలకు పులిస్టాప్ పెట్టొచ్చు.

35

మునగాకులో ఉండే పోషకాలు.. మన జుట్టు తెల్లగా మారకుండా కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సీడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవే.. మన హెయిర్ కలర్ మారకుండా  సహాయపడుతుంది. దీనిలో అమీనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి.. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడతాయి. దీనిలో బయోటిన్  కూడా ఉంటుంది. ఇది.. జుట్టు పెరగడానికి హెల్ప్ అవుతుంది. మునగాకుల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి.  ఇవి.. జుట్టు పెరుగదలలో కీలక పాత్ర పోషిస్తాయి.  ఇవి మాత్రమే కాదు.. జింక్, విటమిన్ ఏ , ఐరన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.

45

మరి.. ఇన్ని పోషకాలు ఉన్న ఈ మునగాకుని హెన్నా మాదిరిగా తలకు ఎలా వాడాలో తెలుసుకుందాం..

ముందుగా.. మీరు మునగాకులసు ఎండపెట్టి పొడిగా చేసుకోవాలి. తర్వాత.. ఆ పొడిని మీరు తలకు వాడే ఏ నూనె అయినా పర్లేదు.. కొబ్బరి నూనె , ఆముదం, ఆమ్లా ఆయిల్.. ఏది వాడితే అందులో ఈ పొడి వేసి.. బాగా కలిపి తలకు పట్టించాలి. లేదంటే నూనెలో ఈ ఆకులను వేసి మరిగించి అయినా.. తలకు అప్లై చేయవచ్చు.. ఈ నూనె రెగ్యులర్ గా రాయడం వల్ల తెల్ల జుట్టు సమస్య ఉండదు.

55

హెయిర్ ప్యాక్ గా కూడా వాడొచ్చు... మునగాకు పొడిని పెరుగులో కలిపి.. దాంట్లో కొద్దిగా రోజ్ వాటర్, బియ్యం నీళ్లు వేసి.. తలకు అప్లై చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చాలా రకాల జుట్టు సమస్యలు తగ్గిపోతాయి.  పై పైన జుట్టుకు అప్లై చేయకపోయినా మునగాకులను రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకున్నా కూడా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. 
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Stainless steel Bangles:డైలీవేర్ కి వాడినా మెరుపు తగ్గని స్టీల్ గాజులు
Recommended image2
Plus Size Kurti: బొద్దుగా ఉండే అమ్మాయిలకు సూటయ్యే బెస్ట్ కుర్తీలు
Recommended image3
Anklet Designs: ఎలాంటి పాదాలకు అయినా రాయల్ లుక్ ఇచ్చే పట్టీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved