కొబ్బరి నూనెలో ఇదొక్కటి కలిపి రాస్తే.. జుట్టు ఒత్తుగా పొరగడం పక్కా..!
మన ఇంట్లో ఉండే సాధారణ కొబ్బరి నూనెతోనే జుట్టు రాలడాన్ని తగ్గించి.. మళ్లీ ఒత్తుగా పెరిగేలా చేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం…
hair oiling
ఈ మధ్య కాలంలో యువత కామన్ గా ఫేస్ చేస్తున్న సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. నిండా 30 రాకముందే.. బట్టతల వచ్చేస్తుందా అనే భయం పెరిగిపోతోంది. అమ్మాయిలు, అబ్బయిలు అనే తేడా లేదు.. అందరిదీ ఇదే సమస్య. ఈ సమస్య నుంచి బయటపడటానికి పాపం ఎవరికి తోచిన ప్రయత్నాలు వాళ్లు చేస్తూ ఉంటారు. ఖరీదైన హెయిర్ ట్రీట్మెంట్లు చేయించడం దగ్గర నుంచి షాంపూలు, నూనెలు వాడుతూనే ఉంటారు. అయితే.. ఇవేమీ అవసరం లేకుండా.. మన ఇంట్లో ఉండే సాధారణ కొబ్బరి నూనెతోనే జుట్టు రాలడాన్ని తగ్గించి.. మళ్లీ ఒత్తుగా పెరిగేలా చేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం…
జుట్టు రాలడానికి కారణం..?
జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. కాలుష్యం, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, సరైన లైఫ్ స్టైల్ ఫాలో కాకపోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే ఉత్పత్తులు వాడటం లాంటి చాలా కారణాల వల్ల జుట్టు బలహీనంగా మారి, ఊడిపోతుంది. పెరుగుదల కూడా అక్కడితో ఆగిపోతుంది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఉంది. కొబ్బరి నూనెతో మళ్లీ మన అందమైన జుట్టును తిరిగి ఎలా పొందాలో తెలుసుకుందాం..
మన అమ్మమ్మలు, బామ్మల జుట్టు ఎప్పుడైనా చూశారా..? ముసలివాళ్లు అయిన తర్వాత కూడా చాలా పొడవుగా ఉండేది వారి జుట్టు. వాళ్లు మనలాగా ఏవేవో ఖరీదైనవి రాయలేదు.. కేవలం ఇంట్లో లభించే మెంతులు, మందార ఆకులు, కొబ్బరి నూనె లాంటివి మాత్రమే వాడేవారు. ఇప్పుడు మనం కూడా అలాంటి ఒక నూనెను తయారు చేసుకోవాలి. అందుకే కొబ్బరినూనె, కరివేపాకు లాంటివి సరిపోతాయి.
Image: Getty
జుట్టు రాలడం తగ్గించడానికి పరిష్కారం..
కొబ్బరి నూనె ,కరివేపాకు రెండూ జుట్టుకు చాలా మేలు చేస్తాయి. కొబ్బరి నూనె జుట్టుకు పోషణ, తేమను అందిస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. అదే సమయంలో, కరివేపాకు జుట్టు అకాల బూడిద, జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. కరివేపాకును కొబ్బరినూనెలో కలిపి రాసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ జుట్టు పొడవుగా, నల్లగా, ఒత్తుగా మారుతుంది.
1.విటమిన్ ఇ..
మీరు కొబ్బరి నూనెను విటమిన్ ఇ నూనెతో కలిపి మీ జుట్టుకు రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జుట్టు దృఢంగా ఉంటుంది. చివర్లు చీలిపోయే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొబ్బరినూనెలో వేప ఆకుల పొడి, దాల్చిన చెక్క పొడి, విటమిన్ ఇ నూనె కలిపి రాసుకోవచ్చు. జుట్టు రాలడాన్ని నివారించడానికి మీరు మీ జుట్టుకు కొబ్బరి, ఉసిరి నూనెను రాసుకోవచ్చు.
Photo Courtesy: Instagram
దాల్చిన చెక్క పొడి
అలాగే దాల్చిన చెక్క పొడిని కొబ్బరినూనెలో కలిపి రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జుట్టు దృఢంగా ఉండటమే కాకుండా చుండ్రు తొలగిపోయి జుట్టు రాలడం తగ్గుతుంది.
జుట్టుకు వేప
వేప ఆకుల పొడిని తయారు చేసి, ఈ పొడిని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టించాలి. మీరు ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసి కొంత సమయం తర్వాత మీ జుట్టును కడగాలి. మీరు ఈ విధానాన్ని వారానికి రెండుసార్లు పునరావృతం చేయవచ్చు. ఇది మీ జుట్టు రాలడాన్ని ఆపివేస్తుంది మూలాల నుండి బలంగా మారుతుంది.
తలకు నూనె ఎలా రాయాలి?
ఈ నూనెను ఉపయోగించాలంటే ముందుగా మీ జుట్టును బాగా దువ్వండి. ఆ తర్వాత ఈ నూనెను తలకు పట్టించి తేలికపాటి చేతులతో మసాజ్ చేయాలి. రాత్రిపూట లేదా కనీసం 2 గంటలు అయినా జుట్టుకు నూనె ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. ఈ నూనెను వారానికి కనీసం రెండు సార్లు అప్లై చేయడం వల్ల మీ జుట్టు వేగంగా పెరుగుతుంది.