షాంపూలో ఏం కలిపి రాస్తే జుట్టు మెరుస్తుందో తెలుసా?
షాంపూలో కేవలం నాలుగు పదార్థాలను కనుక కలిపి.. రెగ్యులర్ గా తలస్నానం చేస్తే.. జుట్టు సమస్యలన్నీ తగ్గడంతో పాటు… జుట్టు మెరుస్తూ కనపడుతుందట. మరి, అదేంటో చూద్దాం…
చలికాలంలో మన జుట్టు చాలా ఎక్కువగా దెబ్బతింటూ ఉంటుంది. ముఖ్యంగా పొడిబారడం, జుట్టు బలహీనంగా మారడం, దాని వల్ల జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. షాంపూలు, నూనెలు మారుస్తూ ఉంటాం… వాటికి బదులు.. షాంపూలో కేవలం నాలుగు పదార్థాలను కనుక కలిపి.. రెగ్యులర్ గా తలస్నానం చేస్తే.. జుట్టు సమస్యలన్నీ తగ్గడంతో పాటు… జుట్టు మెరుస్తూ కనపడుతుందట. మరి, అదేంటో చూద్దాం…
జుట్టు స్మూత్ గా మెరుస్తూ ఉంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మన జుట్టు కూడా సెలబ్రెటీల హెయిర్ లా కనపడుతుంది.మరి, ఆ కెరాటిన్ ట్రీట్మెంట్ ని సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు.
దానికోసం రెండు స్పూన్ల షాంపూ లో 1 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, అర టీ స్పూన్ కొబ్బరి నూనె, అర టీ స్పూన్ నిమ్మరసం, అర కప్పు నీరు వాడితే చాలు..
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మీరు వాడుతున్న షాంపూ 2 స్పూన్లు వేయండి.
ఇప్పుడు అందులో ఒక చెంచా కలబంద, అర చెంచా కొబ్బరినూనె, అరకప్పు నీళ్లు పోసి బాగా కలపాలి.
ఇప్పుడు తయారుచేసిన ఈ ద్రావణాన్ని మీ జుట్టుకు షాంపూ లాగా అప్లై చేసి, ఆపై మీ జుట్టును కడగాలి. ఒక్కసారి దీనిని ప్రయత్నించినా మీకు వెంటనే ప్రయోజనం లభిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాదు.. జుట్టు స్మూత్ గా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
అలోవెరా జెల్ మీ జుట్టును రిపేర్ చేయడానికి, తేమగా మార్చడంలో సహాయపడుతుంది.
రెసిపీలో ఉపయోగించే ఒక టీస్పూన్ కొబ్బరి నూనె మీ జుట్టుకు పోషణనిస్తుంది. జుట్టు రాలకుండా కాపాడుతుంది. నిమ్మరసం శిరోజాలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. వారానికి రెండుసార్లు చేసినా.. మీకు మంచి ఫలితం వస్తుంది.