MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • ముఖానికి మసాజ్ ఎలా చేయాలో తెలుసా..?

ముఖానికి మసాజ్ ఎలా చేయాలో తెలుసా..?

రెగ్యులర్ గా.. ఫేస్ కి మసాజ్ చేస్తూ ఉండటం వల్ల ముఖంలో తెలియని గ్లో ఉంటుంది. వయసు రిత్యా వచ్చే చాలా రకాల  ముడతలను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 12 2024, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Beauty

Beauty

అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అలా అందంగా కనిపించేందుకు  చాలా మంది ఏవేవో క్రీములు, ఆయిల్స్ రాస్తూ ఉంటారు. మనం ఏం రాసినా.. దానిని ముఖానికి సుతిమెత్తగా మసాజ్ చేయడం చాలా ముఖ్యం. మనం మన అందాన్ని... మసాజ్ చేసుకోవడం వల్ల పెంచుకోవచ్చని మీకు తెలుసా? కానీ.. దానిని ఎలా చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రెగ్యులర్ గా.. ఫేస్ కి మసాజ్ చేస్తూ ఉండటం వల్ల ముఖంలో తెలియని గ్లో ఉంటుంది. వయసు రిత్యా వచ్చే చాలా రకాల  ముడతలను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే.. సరిగా చేయకపోతే... ఆ ముడతలు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉందట. అందుకే.. ఫేస్ కి మసాజ్  చేసే సమయంలో..కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అవసరం.
 

37

మసాజ్ ఫేస్ కి మంచిదే కానీ... మనం మసాజ్ చేసే సమయంలో మనం చేతుల డైరెక్షన్ ఎలా పెడుతున్నాం అనేది ముఖ్యం. మసాజ్ చేసేటప్పుడు.. చేతులు.. పై నుంచి కిందకు అనకూడదు. కింద నుంచి.. పైకి మసాజ్ చేయాలి. అప్పుడు.. ఫేస్ కి గ్లో వస్తుంది. రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. మనం నార్మల్ గా ఫేస్ కి క్రీమ్ రాసినా కూడా.. కింద నుంచి పైకి రాయడం అలవాటు చేసుకోవాలి. అది కూడా వృత్తాకారంలో రాయాలి.

47

ఫేస్ మసాజ్ చేసే సమయంలో.. మనం కొన్ని పొరపాట్లు చేస్తే.. ముఖం సాగిపోయినట్లుగా మారుతుందట.  అలా అవ్వకుండా ఉండాలంటే రాసే క్రీము, ఆయిల్.. కింద నుంచి పైకి అప్లై చేయాలి. పెట్టే ప్రెజర్ కూడా అలానే ఉండాలి. అదే.. పై నుంచి కిందకు మసాజ్ చేస్తే.. చర్మం సాగిపోతుంది. ఆ పొరపాటు చేయకూడదు.
 

57

ముఖానికి మసాజ్ చేసే సమయంలో.. ఎంత ఒత్తిడి పెడుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. కొందరు చాలా సున్నితంగా చేస్తారు. దాని వల్ల కూడా ఫలితం ఉండదు. మనకు ఒత్తిడి తెలియాలి.. అది కూడా హాయి అనుభూతి కలిగించాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. అలా అని మరీ ఎక్కువ ఒత్తిడి పెట్టడం కూడా మంచిది కాదు. చర్మం పాడైపోతుంది.కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.
 

67

ఇక మసాజ్ చేస్తున్నప్పుడు.. ప్రాసెస్ కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి. ఊరికూరికే మధ్యలోనే చేతులు తీసేయకూడదు. ఒక కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాతే.. చేతులు తీయాలి. మధ్యలోనే తీసేస్తే  ఉపయోగం ఉండదు. కంటిన్యూస్ గా తక్కువలో తక్కువ 8 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేయడం చాలా ముఖ్యం.

77


ఇక మసాజ్ చేసేటప్పుడు.. ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి. ముఖాన్ని చాలా మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతే మసాజ్ మొదలుపెట్టాలి. లేదంటే.. బ్యాక్టీరియా పెరిగి... చర్మం మరింత పాడయ్యే ప్రమాదం ఉంది. మొటిమల సమస్య కూడా రావచ్చు. కాబట్టి.. ముందుగా.. ఫేస్ వాష్ చేసుకోవాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved