47ఏళ్ల వయసులో ఇంత అందం.. మలైకా బ్యూటీ సీక్రెట్ ఇదే..!
ప్రతిరోజూ తాను చేసే వర్కౌట్స్ కారణంగానే తాను ఇప్పటికీ ఇంత ఫిట్ గా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. మరి.. ఆ వర్కౌట్స్ ఏంటో మనమూ చూసేద్దాం..
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె అందం చూసి.. ఫిట్నెస్ చూసి.. వయసు 47 అంటే ఎవరూ నమ్మరు. అందుకే ఆమెకు ఇప్పటికీ అంత ఫాలోయింది. అంత అందంగా ఉండటానికి గల అసలు సీక్రెట్ ని మలైకా ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో చర్చించారు.
తన చర్మం యవ్వనంగా కనిపించడానికి ప్రతిరోజూ తాను యోగా చేస్తానని.. అందులోనూ మూడు పోశ్చర్స్.. తన చర్మం నిగనిగలాడటానికి సహాయం చేస్తాయని ఆమె వివరించారు. ప్రతిరోజూ తాను చేసే వర్కౌట్స్ కారణంగానే తాను ఇప్పటికీ ఇంత ఫిట్ గా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. మరి.. ఆ వర్కౌట్స్ ఏంటో మనమూ చూసేద్దాం..
ఆమె చేసే యోగాసనాలలో సర్వాంగాసనం ఒకటి. దానిని ఎలా వేయాలో కూడా ఇటీవల మలైకా చేసి చూపించారు. దాని వీడియోని కూడా ఆమె షేర్ చేశారు
ఈ ఆసనం వల్ల రక్త ప్రసరన ముఖానికి బాగా జరుగుతుంది. ఈ ఆసనలో తల కిందకు.. కాళ్లు పైకి పెడతారు. ఆ ఆసనం భుజాలకు, నడుముకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఒక రెండోది.. హాలాసన.. ఈ ఆసనం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు.. డైజెస్టివ్ సిస్టమ్ కూడా మెరుగుపుడుతుంది. ఈ ఆసనం కూడా ముఖం యవ్వనంగా కనిపించడానికి సహాయం చేస్తుంది.
ఇక మూడోది ట్రిగోనాసన.. ఈ ఆసనం చెస్ట్, షోల్డర్స్ కి సహాయపడుతుంది. దీని వల్ల ఫ్రెష్ ఆక్సీజన్ తీసుకోగలుగుతాం. ఫేస్ కూడా గ్లో పెరుగుతుంది.
ఈ ఆసనాలు చేయడంతోపాటు... తాను ఎక్కువగా కూరగాయలు తింటానని మలైకా వివరించారు. యాంటీ ఆక్సీడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ ని ఆమె తీసుకుంటారట. ఉదయాన్నే హెల్తీ స్మూతీతో తన రోజుని మొదలుపెడతానని ఆమె చెప్పారు.
ఆమె బ్రేక్ ఫాస్ట్ లో అవకాడో టోస్ట్ తింటారట. దానిపై చిల్లీ ఫ్లేక్స్ టాపింగ్ చేసుకుంటారట. లంచ్, డిన్నర్ లో డీటాక్స్ ఫుడ్ ని తీసుకుంటారు. ఎక్కువగా ఉడకపెట్టిన కూరగాయలు తింటారు. బరువును ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకుంటారు.
స్వీట్లకు వీలైనంత దూరంగా ఉంటారు. కాకపోతే నెయ్యి, బెల్లం మాత్రం అప్పుడప్పుడు తీసుకుంటారు.
స్వీట్లకు వీలైనంత దూరంగా ఉంటారు. కాకపోతే నెయ్యి, బెల్లం మాత్రం అప్పుడప్పుడు తీసుకుంటారు.
మలైకాకి పాస్తా అంటే బాగా ఇష్టమట. అయితే.. వీట్ పాస్తా తింటారు. ఆల్మండ్ పాలతో ఓట్స్ కలిపి తీసుకుంటారు. డీటాక్స్ జ్యూస్ తీసుకుంటారు.
కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకుంటారు. సీ ఫుడ్ ని తినడానికి ఇష్టపడతారు.
ప్రతిరోజూ 7 నుంచి8 గంటలు నిద్రపోతారు. పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనం పూర్తి చేస్తారు. ఇవన్నీ ఫాలో అవుతారు కాబట్టే.. మలైకా ఇప్పటికీ అంత అందంగా మెరిసిపోతోంది.