పార్లర్ అవసరమే లేదు.. మేకప్ ను ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్ గా లుక్ వస్తుంది
అందంగా కనిపించేందుకు, ముఖంపై మొటిమలు, ఎరుపుదనం, మచ్చలు కనిపించకుండా ఉండేందుకు చాలా మంది మేకప్ ను వేసుకుంటుంటారు. అయితే కొన్ని స్టెప్స్ ను ఫాలో అయితే మీరు మేకప్ ను పర్ఫెక్ట్ గా వేసుకుంటారు.
పెళ్లైనా, పార్టీ అయినా లేదా ఏదైనా స్పెషల్ ఫంక్షన్, పండుగ ఇలా ఆడవాళ్లు ఎక్కడికి వెళ్లినా ఖచ్చితంగా మేకప్ ను వేసుకుంటారు. ఇక కొంతమంది అయితే పర్ఫెక్ట్ గా మేకప్ వేసుకోవడం రాదని పార్లర్ కి కూడా వెళుతుంటారు. కానీ పార్లర్ కి చాలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును ఆదా చేసి మీరే మేకప్ ను పర్ఫెక్ట్ గా వేసుకోవచ్చు. అదికూడా చాలా సింపుల్ గా. అందుకే పర్ఫెక్ట్ లుక్ లో కనిపించడానికి కొన్ని మేకప్ చిట్కాలను తెలుసుకుందాం పదండి.
టేప్ ను ఉపయోగించండి
కళ్లను అందంగా చేయడానికి ఐషాడోను ఉపయోగిస్తుంటారు. కానీ చాలా మందికి దీన్ని సరిగ్గా పెట్టుకోవడం రాదు. పెట్టుకున్నా అంత బాగా రాదు. కానీ మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం దీన్ని చాలా పర్ఫెక్ట్ గా పెట్టుకుంటారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ఐషాడోను పర్ఫెక్ట్ గా పెట్టుకోవడానికి మీరు టేప్ ను ఉపయోగించండి. ఇందుకోసం టేప్ ను మూడు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ముక్కు వైపు నుంచి పైకి అతికించండి. రెండో టేపు ముక్కను దాని కింద అతికించండి. మూడో టేపును మీ కనుబొమ్మలపై ఉంచండి. ఈ విధంగా టేప్ ను ఆర్ యాంగిల్ లో ఉంచండి. దీని తర్వాత ఐషాడోను అప్ లై చేయండి. ఐషాడోను అప్లై చేసిన తర్వాత టేప్ ను తీసేయండి. అంతే పర్ఫెక్ట్ గా ఐషాడో వేసుకోవడం వస్తుంది.
వేలి సాయంతో ఐలైనర్
ఐ లైనర్ కూడా మన ముఖాన్ని అందంగా మార్చేస్తుంది. అందుకే దీన్ని చాలా మంది ఉపయోగిస్తుంటారు. కానీ దీన్ని సరిగ్గా పెట్టుకవడం మాత్రం రాదు. అయితే వేళి సహాయంతో దీన్ని పర్ఫెక్ట్ గా పెట్టుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా వేలి చివరకి కొంత ఐలైనర్ ను తీసుకుని కంటి ఒక మూలన నుంచి చెవి వైపు పెట్టుకుంటూ రండి. అంతే ఎటూ కదలకుండా స్ట్రెయిట్ లైన్ వస్తుంది. అంతే సింపుల్ గా పర్ఫెక్ట్ అయిన ఐలైనర్ ను పెట్టుకోవచ్చు.
ఇలా ఫౌండేషన్ ను ఉపయోగించండి
పర్ఫెక్ట్ లుక్ పొందాలంటే మీరు ఫౌండేషన్ ను తక్కువగా ఉపయోగించాలి. దీన్ని మరీ ఎక్కువగా వాడితే మాత్రం మీ ముఖం మరీ తెల్లగా కనిపిస్తుంది. అందుకే ఫౌడేషన్ ను చేతికి కొంచెం తీసుకుని డాట్స్ డాట్స్ గా ముఖానికి మొత్తం పెట్టండి. ఆ తర్వాత బ్రష్ తో ముఖం మొత్తానికి అప్లై చేయండి. ఆ తర్వాత బ్యూటీ బ్లెండర్ ను వాడి దీన్ని ముఖం అంతటా రాయండి. అంతే సింపుల్ గా మీరే ఇలా పార్లర్ కి వెళ్లకుండా ఇంట్లోనే పర్ఫెక్ట్ మేకప్ ను వేసుకోవచ్చు.