ఈ నూనె ముఖానికి రాస్తే.. ఖరీదైన సీరమ్ లతో పని లేదు
మనం ఇంట్లోనే తయారు చేసుకోగల ఒక ఆయిల్ ఉంది. ఇది ఖరీదు విషయంలో చాలా రీజనబుల్ గా ఉండటమే కాదు... ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి, ఆ నూనె ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...

ముఖం మెరుస్తూ, యవ్వనంగా కనిపించాలనే కోరిక లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? దాని కోసమే మార్కెట్లో దొరికే ఖరీదైన నూనెలు, సీరమ్స్ కొంటూ ఉంటాం. వాటితో ఫలితం ఉండొచ్చు. ఉండకపోవచ్చు. కానీ... మనం ఇంట్లోనే తయారు చేసుకోగల ఒక ఆయిల్ ఉంది. ఇది ఖరీదు విషయంలో చాలా రీజనబుల్ గా ఉండటమే కాదు... ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి, ఆ నూనె ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...
Image: Freepik
మనం ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్ గా క్యారెట్, బీట్ రూట్ లాంటివి తీసుకుంటూ ఉంటాం. ఇవి మనకు ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుతాయి. వీటితో తయారు చేసిన ఒక నూనెను ముఖానికి రాయడం వల్ల.. మన ఫేస్ మునుపటి కంటే మెరుస్తూ, అందంగా తయారౌతుంది.
carrot beetroot juice
ఈ ఫేస్ ఆయిల్ తయారీకి మనకు క్యారెట్, బీట్ రూట్, కొబ్బరి నూనె ఉంటే చాలు. 100 గ్రాముల తురిమిన క్యారెట్, 100 గ్రాముల తురిమిన బీట్రూట్, పావు లీటర్ కొబ్బరి నూనె తీసుకోవాలి. ఒక ప్యాన్ లో మనం ఈ కొబ్బరి నూనె, తురిమి పెట్టుకున్న క్యారెట్,బీట్రూట్ వేసి బాగా మరిగించాలి. మీడియం మంట మీద కనీసం 30 నిమిషాలు మరిగించాలి. తర్వాత.. స్టవ్ ఆఫ్ చేసి దానిని ఆరనివ్వాలి. ఆ తర్వాత.. వడ కట్టుకొని..నూనెను ఒక గాజు కంటైనర్ లో దాచుకోవాలి.
ఇప్పుడు ఈ నూనెను రోజుకి రెండు లేదా మూడు చుక్కలు తీసుకొని.. ముఖానికి అప్లై చేసి.. మంచిగా మసాజ్ చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల.. మీ ముఖం కాంతివంతంగా మారడం పక్కా.
క్యారెట్లలోని విటమిన్ ఎ , సి ముడతలు , మొటిమలను తగ్గిస్తాయి. అకాల వృద్ధాప్య సంకేతాలను నివారిస్తాయి. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. బీట్‌రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. యవ్వనంగా మెరిసేలా చేస్తాయి. నెలరోజులు ఈ నూనె రాసినా మీరు కచ్చితంగా అద్భుతమైన ఫలితాలను చూస్తారు.