MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • ఈ ఒక్క ఫేస్ ప్యాక్ రాసినా... ఐదు నిమిషాల్లో ముఖం మెరిసిపోతుంది..!

ఈ ఒక్క ఫేస్ ప్యాక్ రాసినా... ఐదు నిమిషాల్లో ముఖం మెరిసిపోతుంది..!

Face Glow:  మనకు ఇంట్లో ఎర్ర కందిపప్పు చాలా సులభంగా లభిస్తుంది. ఇదే కంది పప్పు మన ముఖంలో గ్లో తీసుకువస్తుందని మీకు తెలుసా? అయితే.. ఆ కంది పప్పుతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 23 2025, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నిమిషాల్లో ఫేషియల్ గ్లో..
Image Credit : freepik

నిమిషాల్లో ఫేషియల్ గ్లో..

స్కిన్ పై ముడతలు రాకుండా ఉండాలని, యవ్వనంగా కనిపించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దానికోసమే రెగ్యులర్ గా చాలా మంది ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. ఖరీదైన క్రీములు రాసేస్తూ ఉంటారు. అయితే.. పార్లర్ కి వెళ్లి డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేని వాళ్లు కూడా ఉంటారు. అలాంటివారు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే సహజంగా మెరిసిపోవచ్చు. మన ఇంట్లో సులభంగా దొరికే ఒక పప్పుని వాడి ఫేస్ ప్యాక్ వేసుకుంటే... కేవలం ఐదు నిమిషాల్లో ముఖంలో గ్లో పెంచుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎర్ర కందిపప్పు ఫేస్ ప్యాక్
Image Credit : freepik

ఎర్ర కందిపప్పు ఫేస్ ప్యాక్

తక్కువ ఖర్చుతో అందాన్ని పెంచుకోవాలి అనుకునేవారికి ఎర్ర కంది పప్పు బెస్ట్ ఆప్షన్. ఈ పప్పు తో పాటు ముల్తానీ మట్టి, పసుపు లాంటివి కలిపి ముఖానికి రాస్తే... చాలా తక్కువ సమయంలోనే ముఖం మెరిసిపోతుంది. మొటిమల సమస్య కూడా తగ్గుతుంది. చర్మం మృదువుగా మారుతుంది.

34
ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కావాల్సినవి...
Image Credit : Getty

ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కావాల్సినవి...

ఎర్ర కంది పప్పు-100 గ్రాములు, ముల్తానీ మట్టి 50 గ్రాములు, పసుపు 50 గ్రాములు, పచ్చి పాలు కొద్దిగా, వీటితో మనం ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా.. ఎర్ర కందిపప్పు ను కాసేపు నీటిలో నానపెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముల్తానీ మట్టి, పసుపు, పచ్చి పాలు కూడా వేసి మంచి మిశ్రమంలా కలపాలి. ఈ ఫ్యాక్ ని ముఖానికి రాయడానికి ముందు.. నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

44
ముఖానికి ఎలా రాయాలి?
Image Credit : Getty

ముఖానికి ఎలా రాయాలి?

ముఖం కడుక్కున్న తర్వాత.. తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ముఖంతో పాటు మెడకు కూడా అప్లై చేయాలి. కనీసం 20 నిమిషాలపాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాసేపటికే ముఖం మెరుస్తూ కనపడుతుంది. రెగ్యులర్ గా ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. మొటిమల సమస్య కూడా పూర్తిగా తగ్గుతుంది. వారానికి రెండుసార్లు దీనిని రిపీట్ చేయడం వల్ల... మంచి రిజల్ట్స్ వస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతున్న బ్లౌజ్ డిజైన్స్..
Recommended image2
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image3
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Related Stories
Recommended image1
Beauty tips: ఇంట్లోనే పార్లర్ లాంటి ఫేషియల్.. ఈజీగా చేసుకోండి ఇలా!
Recommended image2
Face Glow: కుంకుమ పువ్వును ఇలా ముఖానికి రాస్తే.. నిమిషాల్లో మెరుపు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved