ఇంట్లోనే పార్లర్ లాంటి ఫేషియల్.. ఈజీగా చేసుకోండి ఇలా!
woman-life Aug 07 2025
Author: Kavitha G Image Credits:freepik
Telugu
ఫేస్ వాష్..
ముందుగా ముఖాన్ని మైల్డ్ ఫేస్ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ బేసన్ లో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసి మసాజ్ చేయాలి. ఇది ముఖంపై ఉండే జిడ్డు, మురికిని తొలగిస్తుంది.
Image credits: Getty
Telugu
స్క్రబ్బింగ్
చర్మంపై మృత కణాలను తొలగించడానికి స్క్రబ్ చేయడం ముఖ్యం. ఒక స్పూన్ బియ్యం పిండిలో ఒక స్పూన్ పాలు కలిపి ముఖానికి రాసి 2-3 నిమిషాలు మర్దన చేయాలి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
Image credits: Getty
Telugu
ఫేషియల్ స్టీమింగ్
ఫేషియల్ స్టీమింగ్ తో చర్మంపై రంధ్రాలు తెరుచుకుంటాయి. 5 నిమిషాలు ముఖానికి ఆవిరి పట్టడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
Image credits: Getty
Telugu
ఐస్ తో మసాజ్
ఐస్ క్యూబ్ ను ఒక క్లాత్ లో చుట్టి ముఖంపై మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల చర్మం టైట్ గా మారుతుంది.
Image credits: Freepik
Telugu
ఫేస్ ప్యాక్
ఒక స్పూన్ ముల్తానీ మట్టిలో కొంచెం చందనం, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. దీనివల్ల మచ్చలు తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుంది.
Image credits: freepic
Telugu
మాయిశ్చరైజర్
ఫైనల్ గా తేలికపాటి మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ రాసుకోవాలి. ఇది చర్మాన్ని మృదువుగా, ఫ్రెష్ గా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.