కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి ఎలాంటి ఆహారం ఇష్టపడతారో తెలుసా..?
శ్రీనిధి నటనకు మాత్రమే కాదు.. ఆమె పర్సనాలిటికీ, ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆమె అందం, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..
srinidhi shetty
శ్రీనిధి.. ఈ పేరు వింటే ఎవరికీ పెద్దగా గుర్తు రాకపోవచ్చు. కానీ.. కేజీఎఫ్ హీరోయిన్ అంటే మాత్రం దేశ వ్యాప్తంగా గుర్తుపట్టేస్తారు. కేజీఎఫ్ సినిమా.. దేశంలో ఎంతలా సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో రాకీ గా హీరో యష్ నటించగా.. అందులో హీరోయిన్ పాత్రలో శ్రీనిధి కనపడింది.
మొదటి పార్ట్ లో... ఈ బ్యూటీకి పెద్దగా నటించే స్కోప్ కూడా రాలేదు. కానీ.. సెకండ్ పార్ట్ లో అదరగొట్టేసింది. అందరినీ తన అందం, నటనతో ఆకర్షించేసింది. దీంతో ఆమె కన్నడ ఇండస్ట్రీతో పాటు మిగిలిన భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇతర భాషల్లోనూ ఆమెకు క్రేజ్ పెరగడం విశేషం.
కాగా... శ్రీనిధి నటనకు మాత్రమే కాదు.. ఆమె పర్సనాలిటికీ, ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆమె అందం, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..
శ్రీనిధి.. మంచి భోజన ప్రియురాలు అట. అయితే.. ఫిట్ గా ఉండటానికి మాత్రం ఆమె డైట్ ఫాలో అవుతుందట. ఎక్కువగా ఆమె ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారట. ఆ భోజనం కూడా చాలా సింపుల్ గా ఉండటానికే ఆమె ఇష్టపడతారట.
తాను నిజానికి ఆహార ప్రియురాలు అయినప్పటికీ.. ఇండస్ట్రీలో ఉండటం వల్ల.. తన బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి మంచి ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకుంటానని ఆమె చెప్పారు. ఆమె ప్రతిరోజూ జిమ్ కి కచ్చితంగా వెళ్తారట. తాను తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు కచ్చితంగా ఉండేలా చూసుకుంటారట. ఇలాంటి సమతుల ఆహారం రోజుకి రెండుసార్లు తీసుకుంటారు. ఇక తన చర్మం కోసం.. ఉదయం, రాత్రి.. కచ్చితంగా స్కిన్ కేర్ రోటీన్ ని ఫాలో అవుతూ ఉంటారట.
శ్రీనిధి.. తన రోజులో మొదటి భోజనం దాదాపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీసుకుంటారట, తాను అల్పాహారం కంటే బ్రంచ్ లేదా ప్రారంభ మధ్యాహ్న భోజనాన్ని ఇష్టపడతారట. ఇందులో సాధారణంగా అన్నం, కూర లేదా చపాతీ సబ్జీ ఉండేలా చూసుకుాంటారు.
శ్రీనిధి.. తన రోజులో మొదటి భోజనం దాదాపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీసుకుంటారట, తాను అల్పాహారం కంటే బ్రంచ్ లేదా ప్రారంభ మధ్యాహ్న భోజనాన్ని ఇష్టపడతారట. ఇందులో సాధారణంగా అన్నం, కూర లేదా చపాతీ సబ్జీ ఉండేలా చూసుకుాంటారు.
ఆమె తన లంచ్, డిన్నర్ లో ఆహారం చాలా తేలికగా ఉండేలా చూసుకుంటారట. అందులో.. ఎక్కువగా ఆమె ప్రోటీన్, పండ్లు, సలాడ్ లను తీసుకుంటారట. అవి కూడా ఇంట్లో తమ కుక్ తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు.