బ్రా లను కొనేటప్పుడు ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి.. లేదంటే?
మీరు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా ఎప్పుడూ ఇన్నర్స్ ను వేసుకుంటారు. అందుకే వీటిని సరిగ్గా ఎంచుకోవడం చాలా ముఖ్యం. లోదుస్తులను సరిగ్గా ఎంచుకోకపోతే మీ లుక్ తో పాటుగా ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఇన్నర్స్ ను కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మన మొత్తం రూపాన్ని మెరుగుపరచడంలో లోదుస్తులు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది మన శరీర ఆకారాన్ని మెరుగ్గా ఉంచుతుంది. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. మహిళల లోదుస్తులు అంటే బ్రాలు, ప్యాంటీలను కొనేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం పదండి.
సరైన సైజు
సరైన సైజు లోదుస్తులను కొనడం చాలా ముఖ్యం. ఇన్నర్స్ టైట్ గా లేదా లూజ్ గా ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి. టైట్ ఇన్నర్స్ మీ శరీర ఆకారాన్ని పాడు చేస్తాయి. అలాగే లోదుస్తుల్లో చెమట బాగా పడుతుంది. ఈ చెమట కారణంగా సంక్రమణ ప్రమాదం కూడా ఉంది. టైట్ లోదుస్తుల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే టైట్ లోదుస్తులను ఎప్పుడూ కొనకండి. అలాగే వదులుగా ఉండే లోదుస్తులు మీ శరీర ఆకారాన్ని పాడు చేస్తాయి. కాబట్టి సరైన సైజు వాటినే కొనండి.
సరైన ఫ్యాబ్రిక్
లోదుస్తుల ఫ్యాబ్రిక్ మనకు సౌకర్యవంతంగా ఉండాలి. ఫ్యాబ్రిక్ సరిగ్గా లేకుంటే చర్మం దెబ్బతింటుంది. ఇది సంక్రమణకు దారితీస్తుంది. అందుకే మీ లోదుస్తులను మెత్తగా ఉండేలా చూసుకోండి. మీరు స్పోర్ట్స్ యాక్టివిటీకి లేదా ఏదైనా పని కోసం వెళుతున్నట్టైతే చెమటను సులభంగా గ్రహించే, దద్దుర్లను కలిగించని ఇన్నర్స్ ను వాడండి. అందుకే బట్టలు కొనే ముందే వాటి లుక్ చూడకుండా ఫ్యాబ్రిక్ ను చూడండి.
బ్రా
ప్రతి మహిళ రొమ్ము పరిమాణం భిన్నంగా ఉంటుంది. అందుకే మీరు మీకు సరిపోయే బ్రాలను మాత్రమే కొనండి. ఎక్కువ సైజు లేదా తక్కువ సైజు బ్రాలను కొంటే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తది.
రంగులపై శ్రద్ధ
మీ లోదుస్తుల రంగు కూడా చాలా ముఖ్యం. మీ దుస్తులను బట్టి మీ లోదుస్తుల రంగులను ఎంచుకోవాలి. లైట్, న్యూడ్ కలర్ ఇన్నర్వేర్ దాదాపు ప్రతి రంగు దుస్తులకు సరిపోతుంది. అందుకే మీ లోదుస్తుల సేకరణలో ఈ రంగులను ఎక్కువగా ఉపయోగించండి. మీరు అన్ని దుస్తులతో వీటిని ధరించలేరు. కాబట్టి నియాన్ రంగుల వాడకాన్ని తగ్గించండి.
inner wear
విభిన్న శైలులు
మీరు అన్ని రకాల డ్రెస్సుపై ఒకే రకమైన ఇన్నర్వేర్ ను ధరించలేరు. బ్యాక్ లెస్ డ్రెస్ తో నార్మల్ బ్రా వేసుకోకూడదు. అందుకే మీ ఇన్నర్ వేర్ కలెక్షన్ లో లోదుస్తులు, బ్రా ల వివిధ శైలులను చేర్చడానికి ప్రయత్నించండి.