పండగ కళ ఉట్టిపడేలా.. చీరలో మెరిసిపోతున్న కంగనా రనౌత్..!
పండగ కళ ఉట్టిపడేలా చాలా సార్లు కంగనా రనౌత్ చీరలో దర్శనమిచ్చింది. ఆ చీరల్లో.. ఎప్పుడు ఎలా దర్శనమిచ్చారో ఓసారి చూసేద్దాం..
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. తలైవి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా బిజీగా ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమా ఇటీవల విడుదల కాగా.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కాగా.. సినిమాలో మాత్రమే కాకుండా.. బయట కూడా కంగనా చీరల్లో రాణిలా మెరిస్తూ చాలా సార్లు కనిపించారు.
Kangana Ranaut
పండగ కళ ఉట్టిపడేలా చాలా సార్లు కంగనా రనౌత్ చీరలో దర్శనమిచ్చింది. ఆ చీరల్లో.. ఎప్పుడు ఎలా దర్శనమిచ్చారో ఓసారి చూసేద్దాం..
కంగనా ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ.. ఆమె అందమైన చీరలో దర్శనమిచ్చారు. ఆ చీరకు మ్యాచింగ్ గా.. బంగారు జుమ్కాలు ధరించారు. కాగా.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తో కలిసి ఈచీరలో ఆమె ఫోటో దిగారు. రియల్ లైఫ్ తలైవితో తాను ఉన్నానంటూ ఆ ఫోటోని ఆమె షేర్ చేశారు.
Kangana
రాజకీయ నాయకుల జీవిత కథల ఆధారంగా సినిమాలు రావడం చాలా అరుదు. అలాంటి అరుదైన చిత్రం తమిళనాడు సీఎం జయలలిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ను ఢిల్లీలో రాజకీయ నాయకుల కోసం స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. ఈ సమయంలో.. ఆమె ధరించిన చీర అందరినీ ఆకట్టుకుంటోంది.
Kangana
ఆమె ధరించింది సభ్యాసాచి చీర కాగా.. దానిని పూలతో డిజైన్ చేసిన ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఆమె ధరదించారు. ఈ చీర తో ఆమె ఢిల్లీ లో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
Kangana
పసుపు రంగు కాంజీ వరం పట్టు చీరలో.. మరోసారి ఆమె మెరిసిపోయారు. ఈ చీరకు.. వీ నెక్ బ్లౌజ్ అదిరిపోయింది. దీనికి మ్యాచింగ్ గా.. ముత్యాల చోకర్, జుంకాలు, గాజులు ధరించారు. ఈ లుక్ లో ఆమె అందంగా కనపడుతున్నారు.
ఆరెంజ్ కలర్ చీర, బ్లాక్ బోర్డర్ తో మరోసారి ఆమె ఆకట్టుకున్నారు. చీరకు ఆమె క్లాసిక్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ ధరించారు.
ఈ ఫోటోలో కంగనా.. సభ్యసాచి చీరను ధరించారు. ఆకుపచ్చ చీరకు గోల్డెన్ అంచుతో ఈ చీరలో ఆమె అందంగా మెరిసిపోతున్నారు. ఈ చీరకు మ్యాచింగ్ కాగా.. సవ్య సాచి జ్యెవలరీ ధరించారు.
కంగనా ఇటీవల చెన్నైలోని పురట్చి తలైవి అమ్మ డాక్టర్ జె జయలలిత మెమోరియల్‌ని సందర్శించింది. ఈ సందర్భంగా, నారింజ రంగు కాంజీవరం చీరను ఎరుపు రంగు అంచుతో ఎంచుకుని, అదే రంగులో మెడ మరియు గాజు-స్లీవ్ జాకెట్టుతో జత చేసింది. క్వీన్ నటి స్టేట్మెంట్ నెక్‌పీస్ , మ్యాచింగ్ చెవిపోగులలో కనిపించింది.
స్టేట్మెంట్ ఆభరణాలతో బంగారు అంచుతో ఉన్న ఆఫ్-వైట్ చీరలో కంగనా అందంగా కనిపించారు. చీరకు మ్యాచింగ్ గా ఆమె తలలో మల్లెపూలు ధరించడం విశేషం.