ఇషా అంబానీ ఎలాంటి ఫేస్ వాష్ వాడదు.. అయినా అందంగా ఎలా ఉంటుందో తెలుసా?
మనలో చాలా మంది అందంగా కనిపించడానికి ఫేస్ వాష్ తో పాటుగా ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ను కూడా వాడుతుంటుంది. అయితే ఇషా అంబానీ మాత్రం ముఖానికి ఎలాంటి ఫేస్ వాష్, సన్స్క్రీన్ గానీ వాడదు. అయినా ఆమె అందంగా ఉంటుంది. అది ఎలా సాధ్యమంటే?
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహంలో ఇషా అంబానీ లుక్ జస్ట్ వావ్ అనిపించింది. ఈమె ప్రతి ఒక్క ఫోటోలో చాలా నేచురల్ గా, అందంగా కనిపించింది. నిజానికి ఈమె అందంగా కనిపించడం కోసం ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడదట తెలుసా? అవును ఓ ఇంటర్వ్యూలో ఇషా అంబానీ.. తన బ్యూటీ సీక్రేట్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించింది. ఆమె ఎలాంటి బ్యూటీ రొటీన్ ను ఫాలో అవ్వదని, ముఖానికి ఫేస్ వాష్ అసలే వాడదని చెప్పుకొచ్చింది. వీటిని వాడకుంటే ముఖంలో ఆ మెరుపు ఎలా సాధ్యం అన్న డౌట్లు అందరికీ వస్తాయి. కానీ దీనికోసం ఆమె ఒక చిట్కాను ఫాలో అవుతుందట. మీకు ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్నట్టైతే ఈ చిట్కాను ట్రై చేయండి. మీ ముఖం అందంగా మెరిసిపోతుంది.
సహజంగా ఫేస్ వాష్ ఎలా చేయాలి?
ఫేస్ క్లెన్సర్ వాడకుండా ముఖం అందంగా కనిపించాలంటే కష్టమే అంటారు చాలా మంది. కానీ నేచురల్ గా మెరిసే చర్మం కావాలంటే మాత్రం ఇలా చేయాలి. ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో ఒక టీస్పూన్ గోధుమ పిండి, ఒక టీస్పూన్ శనగపిండిని వేసి కలపండి. దీనిలో కొద్దిగా అలోవెరా జెల్, ఒక టీస్పూన్ తేనెను వేసి కలపండి. అలాగే ఒక టీస్పూన్ నిమ్మరసం కూడా కలపండి.
skin care
ఇప్పుడు దీనిలో రోజ్ వాటర్ ను వేసి పేస్ట్ ను తయారుచేయండి. మరీ చిక్కగా కూడా ఉండకూడదు. దీనిని ముఖానికి అప్లై చేసి చేతులతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని ఉదయాన్నే ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయండి. మసాజ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోవడమే కాకుండా ఫేస్ వాష్ లేకుండా చర్మం శుభ్రపడుతుంది.
skin care
ఏడెనిమిది రోజుల పాటు ప్రతిరోజూ ఫేస్ వాష్ చేసే బదులుగా ఈ నేచురల్ ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మీ ముఖంపై నల్ల మచ్చలు పూర్తిగా పోతాయి. అలాగే మీ ముఖం సహజంగా కాంతివంతంగా అవుతుంది.