జుట్టు బాగా రాలుతోందా? ఈ ఆయిల్ రాస్తే, ఒక్క వెంట్రుక కూడా ఊడదు..!
ఈ ఒక్క నూనె వాడటం వల్ల.... చాలా తక్కువ సమయంలోనే మీ జుట్టు రాలడం తగ్గుతుంది. ఆ తర్వాత ఒక్క వెంట్రుక కూడా రాలదు.
hair oiling
జుట్టు అందంగా, ఆరోగ్యంగా, ఒత్తుగా ఉండాలని కోరుకోనివారు ఎవరైనా ఉంటారా? వయసు పెరిగినా కూడా జుట్టు నెరవడాన్ని, రాలడాన్ని తట్టుకోలేరు. కానీ ఈ ఆధునిక యుుగంలో అందరూ కామన్ గా ఫేస్ చేస్తున్న సమస్య..జుట్టు రాలడం. మన చుట్టూ ఉన్న కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం, మన లైఫ్ స్టైల్ కారణంగా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. దీని కోసం.. మార్కెట్లో దొరికే చాలా షాంపూలను, నూనెలను వాడే ఉంటారు. అవి వాడినా కూడా... జుట్టు రాలడం తగ్గడం లేదు అంటే.. మీరు కచ్చితంగా ఈ నూనె వాడాల్సిందే. ఈ ఒక్క నూనె వాడటం వల్ల.... చాలా తక్కువ సమయంలోనే మీ జుట్టు రాలడం తగ్గుతుంది. ఆ తర్వాత ఒక్క వెంట్రుక కూడా రాలదు. మరి, ఆ నూనె ఏంటి? మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం....
ఈ నూనె వాడటం మొదలుపెట్టిన పది రోజుల్లోనే జుట్టు రాలడం ఆగుతుంది. ఈ నూనె తయారీలో మనం నల్లజీలకర్ర అంటే కళోంజీ సీడ్స్, మెంతులు, మందార పూలను వాడతాం. వీటిని పాన్ లో వేసి వేడి చేయడం ద్వారా ఆయిల్ తయారు చేస్తాం. కచ్చితంగా జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాదు... జుట్టు మొత్తం మృదువుగా, బలంగా కూడా మారుతుంది. జుట్టు చాలా మెరుస్తూ కనపడుతుంది.
ఈ నూనెను ఎలా తయారు చేయాలి?
ముందుగా, ఒక పాన్ తీసుకుని, దానికి కొబ్బరి నూనె వేసి తక్కువ వేడి మీద మరిగించాలి. నూనె వేడి అయిన తర్వాత , కరివేపాకు, మెంతులు, కలోంజి గింజలు అన్నింటినీ సమాన పరిమాణంలో వేయాలి. ఇప్పుడు దానిని 10 నుండి 15 నిమిషాలు తక్కువ మంట మీద మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. నూనె కాస్త చల్లగా మారిన తర్వాత అందులో మందారపూలను వేయాలి. ఆ తర్వాత నూనెను రాత్రంతా అలానే వదిలేయాలి. మరుసటి రోజున నూనెను వడకట్టుకోవాలి. అంతే... ఒక గాజు కంటైనర్ లో స్టోర్ చేయాలి. ఇప్పుడు ఈ నూనెను ప్రతిరోజూ మీ జుట్టుకు రాస్తూ ఉండాలి.
Hair
ఈ నూనె జుట్టుకు ఎలా ఉపయోగపడుతుంది..?
ఈ నూనెతో, జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుంది. జుట్టు బలంగా మారుతుంది. ముఖ్యంగా, జుట్టు పొడవు కూడా మెరుగుపడుతుంది. ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల మీ జుట్టు మునుపటి కంటే మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది. పొడి జుట్టు సమస్య ఉన్నా.. ఆ సమస్య వెంటనే తగ్గుతుంది. జుట్టు మృదువుగా, స్మూత్ గా మారుతుంది.