MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • జుట్టుకు ఆయిల్ మసాజ్ చేస్తే ఏమౌతుందో తెలుసా?

జుట్టుకు ఆయిల్ మసాజ్ చేస్తే ఏమౌతుందో తెలుసా?

చాలా మంది జుట్టుకు అసలు నూనెనే పెట్టరు. కానీ జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగాలంటే మాత్రం రెగ్యులర్ గా జుట్టుకు నూనెను పెట్టాలి. అలాగే ఆయిల్ మసాజ్ కూడా చేయాలి. ఇది మీ జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 14 2024, 10:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మనలో ప్రతి ఒక్కరికీ జుట్టు పొడుగ్గా, ఒత్తుగా, అందంగా కనిపించాలనే ఉంటుంది. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. రెగ్యులర్ గా కొత్త హెయిర్ కేర్ రొటీన్ ను ఫాలో అవుతుంటాం. కానీ చేయాల్సినవి మాత్రం చేయం. అవును ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టుకు నూనెను పెట్టడమే మర్చిపోయారు. కానీ జుట్టుకు నూనె పెడితేనే మన వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. నిజానికి జుట్టుకు నూనె పెట్టడం వల్ల వెంట్రుకలకు పోషణ అందడంతో పాటుగా వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. నల్లగా ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో జుట్టుకు ఆయిల్ మసాజ్ చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.  జుట్టుకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

24

రిలాక్స్డ్  ఫీల్

జుట్టుకు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల రిలాక్డ్స్ ఫీల్ కలుగుతుంది. ఆయిల్ మసాజ్ చేయడానికి చేతి వేళ్లతో తలకు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల తలనొప్పి, టెన్షన్ వంటి సమస్యలు ఇట్టే తగ్గుతాయి. ఒత్తిడి తగ్గడంతో కండరాలు రిలాక్స్ అవుతాయి. దీంతో మీకు నిద్రరావడం ప్రారంభమవుతుంది. అలాగే వేళ్ల సాయంతో నూనెను తలకు బాగా అప్లై చేయండి.
 

34

జుట్టు రాలడం తగ్గాలంటే ఏం చేయాలి? 

ఎండాకాలంలో చెమటలు పట్టడం వల్ల జుట్టులో జిడ్డు బాగా పేరుకుపోతుంది. నెత్తిమీద, జుట్టుకు నూనెను మసాజ్ చేయడం వల్ల ఈ  జిడ్డు సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఇందుకోసం కొబ్బరినూనె, బాదం నూనె లేదా ఆవనూనెతో తలకు మసాజ్ చేయొచ్చు. ఇది మీ జుట్టును షైనీగా చేస్తుంది. 

44
Image: Getty

Image: Getty

సూర్యరశ్మికి జుట్టు దెబ్బతినకుండా ఎలా రక్షించాలి?

ఎండాకాలంలో ఎండలో బయటకు వెళ్లడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. సూర్యరశ్మి, సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు జుట్టును ఎండిపోయేలా చేస్తాయి. సూర్యరశ్మికి జుట్టు దెబ్బతినకుండా ఉండటానికి  మీరు రాత్రి పడుకునే ముందు లేదా తలస్నానం చేయడానికి కొన్ని గంటల ముందు హెయిర్ ఆయిల్ తో నెత్తిమీద బాగా మసాజ్ చేయండి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dandruff: తలలో చండ్రు ఎక్కువగా ఉందా? వీటితో వదిలించండి
Recommended image2
Gold Earrings: 1 గ్రాము బంగారంలో చైన్ డిజైన్ చెవిపోగులు.. చూసేయండి
Recommended image3
Gold Earrings: ట్రెండీ డిజైన్ లో గోల్డ్ స్టడ్స్.. చూస్తే కొనేస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved